Megastar : చిరు స్పీడ్ మాములుగా లేదుగా
Megastar : ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా పూర్తి కావడంతో, ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లి, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది
- By Sudheer Published Date - 09:50 PM, Wed - 19 March 25

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు లైన్లో పెడుతూ యంగ్ హీరోలకు షాక్ ఇస్తున్నారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమా పూర్తి కావడంతో, ఆయన తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. అనిల్ రావిపూడితో చిరంజీవి ఓ సినిమా చేయనుండగా, ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లి, వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
Fact Check : హలాల్ జ్యూస్ పేరుతో జ్యూస్‌లోకి ఉమ్మి.. వైరల్ వీడియోలో నిజమెంత ?
ఇదే కాకుండా ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరు మరోసారి దర్శకుడు బాబీతో కలిసి పనిచేయబోతున్నారు. చిరు కెరీర్‌లోనే అతిపెద్ద కమర్షియల్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరు ఓ సినిమా చేయబోతున్నారు. అయితే శ్రీకాంత్ ప్రస్తుతానికి నాని నటిస్తున్న ‘పారడైజ్’ సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాతే చిరంజీవి ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది.
అదే సమయంలో వెంకీ అట్లూరి కూడా చిరంజీవికి ఓ కథ వినిపించారని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో హిట్ కొట్టిన వెంకీ, ప్రస్తుతం సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. అది పూర్తైన తర్వాత చిరుతో ఆయన సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే చిరంజీవి లైనప్ ఇప్పటికే రెండు నుంచి మూడు సంవత్సరాల వరకూ ఫుల్ బిజీ గా ఉన్నారు.