Ram Charan: రాంచరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డు.. మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ వైరల్..!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
- Author : Gopichand
Date : 03-12-2022 - 7:55 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్రముఖ టెలివిజన్ ఛానెల్ ఎన్డీటీవీ నిర్వహించిన అవార్డుల కార్యక్రమంలో ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును సొంతం చేసుకొన్నారు. ఈ అవార్డు కార్యక్రమంలో ట్రూ లెజెండ్ అవార్డుతో రాంచరణ్ ను సత్కరించారు. ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డును స్వీకరించిన నేపథ్యంలో రాంచరణ్‌ను మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసి అభినందించారు. నిన్ను చూస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. అంతేకాకుండా ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకొన్న తర్వాత నిన్ను చూస్తే గర్వంగా కూడా ఉంది. ఇంకా ఇలాంటి అవార్డులు చాలా సాధించాలంటూ మెగాస్టార్ కోరుకున్నారు.
రాంచరణ్ ఈ ఏడాది RRR చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15లో నటిస్తున్నారు. ఇటీవల బుచ్చిబాబుతో ఓ సినిమాను ఎనౌన్స్ చేశారు. ఇవే కాకుండా చాలా సినిమాలు సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గాడ్ ఫాదర్ మూవీతో సినీ ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం చిరు బాబీ డైరెక్షన్ లో వాల్తేరు వీరయ్య మూవీ చేస్తున్నారు. ఈ మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎంపీవీ నుంచి ఇటీవల విడుదల అయిన బాస్ పార్టీ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.
Nanna,
Absolutely thrilled for you and proud, on winning the #TrueLegend – #FutureOfYoungIndia Award #NDTV
Bravo!!! 👏👏 Way to go, dearest @AlwaysRamcharan– Appa & Amma pic.twitter.com/6t1wJuvzxy
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 2, 2022