Chinrajeevi: మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కిందా.. అసలు విషయం ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త హల్‌చల్ చేస్తుండగా చిరు ఆ వార్తలపై తాజాగా స్పందించారు.
- By Anshu Published Date - 11:03 AM, Sun - 2 March 25

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో ఆ నటిస్తూ దూసుకుపోతున్నారు. సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కాగా చిరంజీవి చివరగా గాడ్ ఫాదర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదల పర్వాలేదు అనిపించుకుంది.
ఇకపోతే చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేయబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై మూవీ మేకర్స్ ఇంకా స్పందించలేదు. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో మెగాస్టార్ కి సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది.
అదేంటంటే చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఆయనకు యూకే గవర్నమెంట్ యూకే సిటిజెన్షిప్ ఇచ్చి గౌరవించింది అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే చిరంజీవిని యుకెలో సన్మానించెందుకు అక్కడ ఒక కార్యక్రమాన్ని కూడా ప్లాన్ చేశారట. ప్లాన్ ఏదైనా ప్రస్తుతం చిరంజీవి ఆ కార్యక్రమానికి కూడా హాజరు కావటం లేదని తెలిసింది. ఇటీవల దుబాయ్ వెళ్లొచ్చిన చిరంజీవి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారట. త్వరలో విశ్వంభర పనుల్లో నిమగ్నం కానున్నారట.