Mega Combo : ‘రఫ్ఫాడించేద్దాం’ అంటున్న నయనతార
Mega Combo : “హలో మాస్టారు కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా”, “సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం” వంటి డైలాగ్స్ చెబుతూ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తోంది
- By Sudheer Published Date - 09:19 PM, Sun - 18 May 25

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నయనతార (Nayanthara) ఓ ప్రత్యేకమైన స్థానం కలిగిన నటి. కోట్ల పారితోషికం అందుకుంటూ నటించినా, ప్రమోషన్ల విషయంలో మాత్రం వెనుకడుగు వేయడం ఆమె స్టైల్. కానీ అనిల్ రావిపూడి (Anil Ravipudi) మాత్రం ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేశారు. చిరంజీవి(Chiranjeevi)తో కలిసి చేస్తున్న కొత్త సినిమా కోసం నయనతారను కేవలం ఒప్పించడమే కాకుండా, ఓ ప్రమోషనల్ వీడియో కూడా చేయించుకున్నారు. ఇది ఇండస్ట్రీలో ఆశ్చర్యం కలిగించే విషయం. చెన్నై వెళ్లి కథ చెప్పిన అనిల్, తన మేటి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో ఆమెను స్కిట్ చేయించడానికి ఒప్పించారు.
Anirudh : దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే మ్యూజిక్ డైరెక్టర్ ఇతడే !!
ఈ వీడియోలో నయనతార, “హలో మాస్టారు కెమెరా కొద్దిగా రైట్ టర్నింగ్ ఇచ్చుకోమ్మా”, “సంక్రాంతికి రఫ్ఫాడించేద్దాం” వంటి డైలాగ్స్ చెబుతూ కనిపించడం అభిమానుల్లో ఉత్సాహం కలిగిస్తోంది. ఇది సినిమా ప్రకటన మాత్రమే కాదు, నయనతార ప్రమోషన్లలో పాల్గొంటుందనే సంకేతాన్ని కూడా ఇస్తోంది. ఇది సినిమా మార్కెటింగ్‌కు పెద్ద ప్లస్‌గా మారనుంది. చిరంజీవి-నయనతార కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలున్న నేపథ్యంలో, ఈ వీడియో సినిమాపై హైప్ పెంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది.
ఈనెల 22వ తేదీ నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్‌లో పది రోజులపాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నయనతారతో పాటు కేథరిన్ ట్రెసా కూడా మరో కథానాయికగా కనిపించనుంది. సంగీత దర్శకుడిగా భీమ్స్ Ceciroleo పనిచేస్తున్న ఈ చిత్రానికి ఇప్పటికే మూడు పాటలు రికార్డయ్యాయని సమాచారం. ఈలోగా చిరంజీవి స్వయంగా ఓ పాట పాడబోతున్నారన్న వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి.
#Mega157 with the MegaStar @KChiruTweets Sankranthi 2026 🔥 pic.twitter.com/c15pw3lMLl
— Nayanthara✨ (@NayantharaU) May 17, 2025