Gaddar Awards : రేవంత్ గుర్తు చేస్తే తప్ప చిరంజీవి కి గద్దర్ అవార్డ్స్ గుర్తుకు రావా..?
గద్దర్ అవార్డ్స్ వేడుకలపై సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం
- By Sudheer Published Date - 08:47 PM, Tue - 30 July 24

నంది అవార్డ్స్ (Nandi Awards) ప్లేస్ లో గద్దర్ అవార్డ్స్ (Gaddar Awards) ను అందజేయబోతున్నట్లు సీఎం రేవంత్ (CM Revanth Reddy) ప్రకటించిన సంగతి తెలిసిందే. గద్దర్ జయంతి సందర్బంగా జనవరి 31 న ఈ ప్రకటన చేసారు. అర్హులైన రచయితలు, డైరెక్టర్స్ , నటి నటులకు, సినిమాలకు గద్దర్ అవార్డ్స్ ను అందజేస్తామని తెలిపారు. ఈ ప్రకటన చేసి చాల నెలలు అవుతున్నప్పటికీ దీనిపై ఇంతవరకు సినీ పరిశ్రమ స్పందించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేసారు. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో గద్దర్ అవార్డ్స్ ఫై మాట్లాడుతూ.. గద్దర్ అవార్డ్స్ వేడుకలపై సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులను ప్రకటించాం. సినీ పరిశ్రమ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవటం బాధాకరం’’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ వ్యాఖ్యలకు మెగాస్టార్ చిరంజీవి (CHiranjeevi) సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గతంలో గద్దర్ అవార్డుల ప్రదానోత్సవానికి మద్దతుగా తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసిన చిరు.. ‘తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ , సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’ ప్రకటించడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తర్వాత తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను’ అని రాసుకొచ్చారు. కాగా చిరంజీవి స్పందన ఫై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. సీఎం స్వయంగా గద్దర్ వేడుకల గురించి గుర్తు చేస్తే తప్ప స్పందించారా..? సినిమా టికెట్ ధరలు పెంచాలంటూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లి సీఎం తో మాట్లాడి..టికెట్ ధరలు పెంచుకుంటారు..కానీ ఓ గొప్ప రచయిత , సింగర్ పేరుతో అవార్డ్స్ వేడుక చేద్దామంటే స్పందించారా..? ఇదేనా కళాకారులకు ఇచ్చే గౌరవం..? అని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా ‘గద్దర్ అవార్డ్స్’
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
Read Also : IPhone Charging : ఐఫోన్ ఛార్జింగ్ సూపర్ ఫాస్ట్ కావాలా ? ఈ టిప్స్ ఫాలోకండి