Pawan Kalyan : చిరంజీవి సినిమా వల్ల పవన్ సినిమాని థియేటర్స్ లోంచి తీసేశారు తెలుసా?
గుడుంబా శంకర్ వంటి టైటిల్ తో వస్తే మాస్ అండ్ సీరియస్ కథ అనుకోని అభిమానులు థియేటర్ కి వెళ్తే.. కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు.
- By News Desk Published Date - 09:30 PM, Mon - 5 June 23

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan).. ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో కెరీర్ ని స్టార్ట్ చేసి మంచి విజయానే అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా 7 సినిమాలతో హిట్స్ ని అందుకొని ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ లిస్ట్ లో చేరిపోయాడు. 7వ సినిమా ఖుషీ(Kushi) బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని పవన్ కి యూత్ లో తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసింది. అయితే ఆ తరువాత పవన్ దర్శకత్వం వహిస్తూ నటించిన సినిమా ‘జానీ'(Johny). 2003 లో భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది.
ఆ మూవీ తరువాత పవన్ చేసిన సినిమా ‘గుడుంబా శంకర్'(Gudumba Shankar). ఈ సినిమాకి పవన్ స్క్రీన్ ప్లే అందించడం విశేషం. నాగబాబు(Nagababu) నిర్మించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఆ పోస్టర్స్ లో పవన్ డ్రెస్సింగ్ స్టైల్. మణిశర్మ ఇచ్చిన చార్ట్ బస్టర్ ట్యూన్స్, గుడుంబా శంకర్ అనే మాస్ టైటిల్.. సినిమా పై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. 2004 సెప్టెంబర్ 10న రిలీజ్ అయిన ఈ మూవీ.. థియేటర్ వద్ద అభిమానులకు షాక్ ఇచ్చింది.
గుడుంబా శంకర్ వంటి టైటిల్ తో వస్తే మాస్ అండ్ సీరియస్ కథ అనుకోని అభిమానులు థియేటర్ కి వెళ్తే.. కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా ఉండడంతో ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందారు. అయితే కొన్ని రోజులకి సినిమాపై చిన్నగా పాజిటివ్ టాక్ పెరుగుతూ వచ్చింది. అప్పటికి అభిమానులు నెల రోజులు కొన్ని థియేటర్స్ లో ఆ సినిమాని ఆడించారు. కానీ ఇంతలో చిరంజీవి శంకర్ దాదా MBBS మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. 15 అక్టోబర్ 2004 లో ఈ సినిమా రిలీజ్ అవ్వడంతో పవన్ గుడుంబా శంకర్ థియేటర్స్ ఖాళీ చేసేశారు. శంకర్ దాదా సినిమా సూపర్ హిట్ అవ్వడంతో గుడుంబా శంకర్ సినిమా షోలు అన్ని పూర్తిగా తీసేశారు. ఇంకో విశేషం ఏంటంటే గుడుంబా శంకర్ గెటప్ లో పవన్ శంకర్ దాదా MBBS లో క్యామియో రోల్ లో కనిపించాడు. ఇలా చిరంజీవి సినిమా వల్ల పవన్ సినిమాని ఉన్న కొన్ని థియేటర్స్ నుంచి కూడా తీసేశారు.
Also Read : Adipurush Pre-release: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా చినజీయర్.. ప్రభాస్ ఫ్యాన్స్ జోష్!