Adipurush Pre-release: ఆదిపురుష్ ప్రీ రిలీజ్ కు గెస్ట్ గా చినజీయర్.. ప్రభాస్ ఫ్యాన్స్ జోష్!
ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచింది.
- Author : Balu J
Date : 05-06-2023 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదిపురుష్ సినిమా త్వరలో విడుదల కానుండటంతో మూవీ టీం ప్రమోషన్ల జోరు పెంచింది. ఇప్పటికే ట్రైలర్ వదిలి సినిమాపై అంచనాలు పెంచింది. ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా రేపు (జూన్ 6) ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో భారీగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ వేడుకకు ఎవరో చీఫ్ గెస్ట్ వస్తారు? అనేది ఆసక్తి రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద గురువు శ్రీ చినజీయర్ స్వామి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా విచ్చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
సినిమాను జై శ్రీరామ్ అంటూ ప్రమోట్ చేస్తుండటంతో గెస్టుగా ఆయనైతేనే కరెక్ట్ అని భావిస్తున్నారు. తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగులో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ థియేట్రికల్ రైట్స్ దక్కించుకుంది. ప్రభాస్ రాముడి పాత్రలో, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీఖాన్ రావణుడిగా, సన్నీసింగ్ లక్ష్మణుడి పాత్రల్లో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ఆదిపురుష్. జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పటి వరకూ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్, పాటలు, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో పాటు.. సినిమా పై అంచనాలు కూడా పెరిగాయి.
The Spiritual Aura around #Adipurush Pre-Release is in PEAK🔥#ChinnaJeeyarSwamy Garu to grace as prominent guest 🙏
Witness #AdipurushPreReleaseEvent, Tomorrow from 5PM 💥
In cinemas worldwide on June 16th 🛕#Prabhas @omraut #SaifAliKhan… pic.twitter.com/ETlYyR3Hx0
— People Media Factory (@peoplemediafcy) June 5, 2023
Also Read: 3-year-old boy: షాకింగ్.. పాము పిల్లను నమిలి చంపేసిన మూడేళ్ల బాలుడు!