Chiranjeevi – Rajinikanth : కాలేజీలో రజినికి చిరు జూనియర్ అని తెలుసా..?
కాలేజీలో రజినికి చిరు జూనియర్ అని తెలుసా..? ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్స్ గా ఎదిగిన చిరు, రజిని..
- By News Desk Published Date - 04:20 PM, Sat - 13 July 24

Chiranjeevi – Rajinikanth : మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీకాంత్ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి, స్టార్స్ గా ఎదిగి దశాబ్దాలు పాటు ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు అందిస్తూ, వందల కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ.. యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. ఇక వీరిద్దరూ కెరీర్ స్టార్టింగ్ కి వస్తే.. రజినీకాంత్ 1975లో యాక్టింగ్ ని మొదలు పెట్టారు. చిరంజీవి 1978లో తన కెరీర్ ని స్టార్ట్ చేసారు. ఇలా కెరీర్ స్టార్టింగ్ పరంగా చూసుకుంటే చిరంజీవి, రజినీకాంత్ కి జూనియర్ అనే చెప్పాలి. అయితే కేవలం కెరీర్ లో మాత్రమే కాదు, ఫిలిం ఇన్స్‌టిట్యూట్ కాలేజీలో కూడా చిరంజీవి, రజినికి జూనియరే అంట.
యాక్టింగ్ మీద ఇంటరెస్ట్ ఉన్న చిరంజీవి.. తన డిగ్రీ పూర్తి చేసుకున్న తరువాత మద్రాస్ వచ్చి ఫిలిం ఇన్స్‌టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు కోసం జాయిన్ అయ్యారు. ఇక అదే ఇన్స్‌టిట్యూట్ లో రజిని కూడా యాక్టింగ్ కోర్సు చేసి బయటకు వచ్చారు. రజినీకాంత్ 1973లో తన యాక్టింగ్ కోర్స్ ని పూర్తి చేసి బయటకి వచ్చారు. ఇక చిరంజీవి 1976లో తన యాక్టింగ్ కోర్స్ ని కంప్లీట్ చేసారు. అలా ఒకే ఫిలిం ఇన్స్‌టిట్యూట్ నుంచి బయటికి వచ్చిన చిరంజీవి, రజినీకాంత్.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే గొప్ప నటులుగా ఎదిగారు.
కాగా కెరీర్ స్టార్టింగ్ లో వీరిద్దరూ రెండు మూడు సినిమాల్లో కలిసి నటించారు. 1980లో వచ్చిన రజినీకాంత్ ‘కాళీ’ సినిమాలో చిరంజీవి ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఆ తరువాత 1981లో వచ్చిన ‘బందిపోటు సింహం’లో రజిని, చిరు కలిసి నటించారు. ఈ సినిమాలో చిరంజీవిది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర. ఆ తరువాత ఇద్దరికీ ఒక స్టార్ ఇమేజ్ వచ్చిన తరువాత రజినీకాంత్ ‘మప్పిళ్ళై’ సినిమాలో చిరు గెస్ట్ అపిరెన్స్ ఇచ్చి వావ్ అనిపించారు. ఆ సినిమా తరువాత మళ్ళీ ఇప్పటివరకు చిరు, రజిని కలిసి ఒకే ఫ్రేమ్ లో కనిపించలేదు.