Chiranjeevi – Balakrishna : బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కి మొదటి అతిథి చిరంజీవి..
బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కి మొదటి అతిథిగా చిరంజీవి రాబోతున్నారు. తెలుగు 24 క్రాఫ్ట్స్ యూనియన్..
- By News Desk Published Date - 01:55 PM, Fri - 16 August 24

Chiranjeevi – Balakrishna : గత దశాబ్దాల కాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న ఇద్దరు బడా హీరోలు చిరంజీవి, బాలకృష్ణ. ఆరు పదుల వయసు దాటిన తరువాత కూడా వరుస పెట్టి సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ.. ఇప్పటి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. కాగా వీరిద్దరూ ఇండస్ట్రీకి వచ్చి నలభై ఏళ్ళు ఎప్పుడో దాటేసింది. చిరంజీవి మరో నాలుగేళ్ళ 50 ఏళ్ళ మైలు రాయిని దాటనున్నారు. ఇక బాలయ్య ఏమో ఈ ఏడాదే తన 50 ఇయర్స్ బెంచ్ మార్క్ ని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు.
ఇక ఈ బెంచ్ మార్క్ ని తెలుగు 24 క్రాఫ్ట్స్ యూనియన్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ నోవొటెల్ హోటల్ లో ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈక్రమంలోనే ఈ ఈవెంట్ కి మొదటి అతిథిగా చిరంజీవిని తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ మొదటి ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించారు. ఇక ఈ విషయం మెగా మరియు నందమూరి అభిమానులకు తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
24 Crafts Union 1st Invitation to @KChiruTweets Garu for Celebrations of Natasimham #NandamuriBalakrishna Garu’s exceptional cinematic journey of five decades on September 1st at NOVOTEL HITEX HICC, Hyderabad.
#NBK50YearsCelebrations #NBK50inTFI pic.twitter.com/5nzO2ADuhh— Suresh Kondeti (@santoshamsuresh) August 15, 2024
గత దశాబ్దాల కాలం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్యతో నువ్వా నేనా అంటూ పోటీ పడుతూ వస్తున్న చిరంజీవిని.. బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్‌కి తీసుకు రావడం అందర్నీ ఆకర్షిస్తుంది. టాలీవుడ్ లో లెజెండ్స్ గా ఎదిగిన వీరిద్దరూ ఒకే స్టేజి పై కనిపిస్తున్నారు అనే వార్త తెలియడంతో.. మెగా మరియు నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అలాగే ఈ ఈవెంట్ కి ఇంకెవరెవరు రాబోతున్నారా..? అనే ఆసక్తి నెలకుంది. వీరిద్దరితో పాటు టాలీవుడ్ మరో రెండు స్తంబాలుగా ఉన్న నాగార్జున, వెంకటేష్ ని కూడా ఆహ్వానిస్తే బాగుటుందని ప్రేక్షకులు కోరుతున్నారు.