Chinmayi Sripada: పండంటి కవలలకు జన్మనిచ్చిన చిన్మయి శ్రీపాద దంపతులు
సింగర్ చిన్మయి శ్రీపాద, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు.
- Author : Balu J
Date : 22-06-2022 - 3:16 IST
Published By : Hashtagu Telugu Desk
సింగర్ చిన్మయి శ్రీపాద, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ సెలబ్రిటీ జంటకు జన్మించిన కవలలో ఒక అమ్మాయి, అబ్బాయి. “ద్రిప్తా, శర్వాస్… రాకతో ఆనందంగా ఉంది’’ అని రియాక్ట్ అయ్యారు. చిన్మయి శ్రీపాద తన ఇటీవలి పోస్ట్‌లలో “నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేయనందున, సర్రోగేట్ ద్వారా నాకు కవలలు పుట్టారా అని కామెంట్స్ చేస్తున్నారు. అలాంటివాళ్లను నేను ప్రేమిస్తున్నాను” సోషల్ మీడియాలో స్పందించింది. “నేను గర్భవతిగా ఉన్న ఫోటోలను నేను పోస్ట్ చేయలేదు. నా సర్కిల్‌లో ఉన్నవారికి మాత్రమే తెలుసు ” అని ఆమె పేర్కొంది. తాను, తన భర్త రాహుల్ రవీంద్రన్ తమ కవలల ఫోటోలను కొంతకాలం పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబోమని ఈ సందర్భంగా చిన్మయి ప్రకటించింది.
Driptah and Sharvas
The new and forever center of our Universe. ❤️
@rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx— Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022