Dhanush-Aishwarya Divorce : ధనుష్ దంపతులకు విడాకులు మంజూరు చేసిన కోర్ట్
Dhanush-Aishwarya Divorce : ఇటీవల వీరువిడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని కోర్ట్ కు తెలుపడంతో దీనిపై పూర్తి విచారణ జరిపి..ఇరువురి కోరిక మేరకు కోర్ట్ విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది.
- Author : Sudheer
Date : 27-11-2024 - 11:04 IST
Published By : Hashtagu Telugu Desk
హీరో ధనుష్ – ఐశ్వర్య రజినీకాంత్‌లకు చెన్నై ఫ్యామిలీ కోర్టు విడాకులు (Dhanush-Aishwarya Divorce) మంజూరు చేసింది. ఇటీవల వీరువిడాకుల కోసం కోర్ట్ మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. కలిసి జీవించేందుకు సుముఖంగా లేమని కోర్ట్ కు తెలుపడంతో దీనిపై పూర్తి విచారణ జరిపి..ఇరువురి కోరిక మేరకు కోర్ట్ విడాకులు ఇస్తూ తీర్పు ఇచ్చింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య(Aishwarya )ను 2024 నవంబర్ 18న ధనుష్ (Dhanush పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీస్సులతోనే ఈ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దాదాపు 18 ఏళ్లపాటు కాపురం చేసిన ఈ జంట 2022 నవంబర్‌లో తాము విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తరువాత చట్టబద్ధంగా విడిపోవడానికి ఫ్యామిలీ కోర్ట్‌ను ఆశ్రయించారు. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 21న ఫ్యామిలీ కోర్ట్ ముందు వీరిరువురూ విచారణకు హాజరయ్యారు. పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు న్యాయస్థానానికి తెలిపారు. దీనితో న్యాయమూర్తి బుధవారం వారికి విడాకులు మంజూరు చేశారు. వీరిద్దరూ చిన్నచిన్న మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అంతకుముందు మూడుసార్లు ఈ కేసు విచారణకు వచ్చింది. కానీ ధనుష్ – ఐశ్వర్య అంతకు ముందు జరిగిన అన్ని సెషన్లకు గైర్హాజరయ్యారు. ఐశ్వర్య గురువారం కోర్టుకు హాజరయ్యారు. దీంతో న్యాయమూర్తి విడాకుల పిటిషన్‌పై తుది ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కుబేర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కీలకపాత్ర పోషిస్తుండగా.. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుంది.ఐశ్వర్య విషయానికి వస్తే.. ప్రస్తుతం తన తండ్రి రజనీకాంత్ హీరోగా నటిస్తున్న లాల్ సలామ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా షూటింగ్ అయిపోయినట్లుగా వార్తలు రాగా.. మళ్లీ తిరిగి పట్టాలెక్కినట్లుగా తెలుస్తోంది.
Read Also : Minister Sridhar Babu: తెలంగాణతో ద్వైపాక్షిక సంబంధాలకు బల్గేరియా ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు