Chandrayaan-3 : ప్రభుత్వ పాఠశాలల్లో చంద్రయాన్-3 ల్యాండింగ్ ప్రత్యక్షప్రసారం
చంద్రయాన్ -3 నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అపురూపమైన ఘట్టాన్ని యూపీలోని(UP) అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) ప్రత్యక్ష ప్రసారం(Live Telecast) చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Uogi Adityanath) నిర్ణయించారు.
- By News Desk Published Date - 07:27 PM, Tue - 22 August 23

ఒక్క భారతదేశమే కాదు.. ఇప్పుడు ప్రపంచ దేశాల చూపంతా ఇస్రో చంద్రుడిపై(Moon) ప్రయోగించిన చంద్రయాన్ -3(Chandrayaan-3) వైపే ఉంది. మరికొద్ది గంటల్లో.. విక్రమ్ ల్యాండర్(Vikram Lander) చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టి సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతుండగా.. యావత్ దేశ ప్రజలంతా చంద్రయాన్-3 విజయంవంతం కావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. ఎవరిని కదిపినా.. చంద్రయాన్-3 గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో, వార్తల్లో, స్టేటస్ లలో అన్నింటా చంద్రయాన్ -3 గురించే చర్చ జరుగుతోంది. ఇది సక్సెస్ అయితే.. మన ఇస్రో కీర్తి.. ప్రపంచమంతా చాటుకుంటుంది.
చంద్రయాన్ -3 నుంచి విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అపురూపమైన ఘట్టాన్ని యూపీలోని(UP) అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో(Government Schools) ప్రత్యక్ష ప్రసారం(Live Telecast) చేయాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Uogi Adityanath) నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాట్లు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశారు జారీ చేశారు. ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.27 గంటల సమయానికి చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ప్రక్రియను ఇస్రో తమ అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్ ఛానల్, డీడీ నేషనల్ ఛానళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ప్రభుత్వ పాఠశాలల్లో రేపు (ఆగస్టు 23) సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకూ ప్రత్యక్ష ప్రసారానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల్లో పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు అధికారులంతా ఆయా స్కూళ్లలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యే ఘట్టాన్ని విద్యార్థులకు చూపించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమైతే.. జాబిల్లి దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. ఇది దేశచరిత్రలో, ఇస్రో చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోనుంది.
Also Read : Chandrayaan-3 : చంద్రయాన్ -3 తో భారత్ చరిత్ర సృష్టించబోతోంది