Cannes 2024: ఐశ్వర్య రాయ్ ని అవమానించిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐశ్వర్య పేరుని ప్రస్తావించలేదు, ఒమర్ సై, గ్రెటా గెర్విగ్, నాడిన్ లబాకి, అన్నా మౌగ్లాలిస్ మరియు ఐరీన్ జాకబ్‌లతో సహా వివిధ ప్రముఖుల ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ వారు ఐశ్వర్య పేరును ప్రస్తావించలేదు.ఇది ఆమె అభిమానులను కలవరపెట్టింది. వారు తమ నిరాశని వక్తం చేశారు. దీంతో ఫెస్టివల్ టీమ్ స్పందించి ఐశ్వర్య పేరును చేర్చేలా కొత్త పోస్టును పెట్టింది.
- By Praveen Aluthuru Published Date - 04:49 PM, Fri - 17 May 24

Cannes 2024: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఐదు పదుల వయసులోనూ తన అందంతో ఆకట్టుకుంటుంది. ఐశ్వర్య, అభిషేక్ గారాలపట్టి ఆరాధ్య బచ్చన్ కు 15 ఏళ్ళు. ఓ వైపు కుటుంబాన్ని చూసుకుంటూ, తన ప్రొఫెషన్ ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా అద్భుతంగా ప్లాన్ చేస్తుకుంటుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో జరుగుతున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో విశ్వసుందరి ఐశ్వర్య పాల్గొన్నది. గాయాన్ని లెక్కచేయకుండా ఆమె ఈ ఫెస్టివల్స్ కి హాజరయ్యారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ఐశ్వర్య రాయ్ ని ప్రశంసిస్తున్నారు. అయితే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పై ఐశ్వర్యకు ఉన్న ప్రేమ గురించి అందరికి తెలిసిందే. కానీ అదే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఐశ్వర్య రాయ్ ని దారుణంగా అవమానించింది. ప్రస్తుతం ఇదే విషయంపై నెటిజన్లు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ పై మండిపడుతున్నారు.
వాస్తవానికి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ఐశ్వర్య సుపరిచితమైన ముఖం, సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఆమె ఈ ఫెస్టివల్ కి హాజరవుతున్నారు. ఈసారి ఆమెతో పాటు ఆమె కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా హాజరయ్యారు. ఈవెంట్‌లో వారి చిత్రాలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే అక్కడ కాస్త వివాదం నెలకొంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐశ్వర్య పేరుని ప్రస్తావించలేదు, ఒమర్ సై, గ్రెటా గెర్విగ్, నాడిన్ లబాకి, అన్నా మౌగ్లాలిస్ మరియు ఐరీన్ జాకబ్‌లతో సహా వివిధ ప్రముఖుల ఫోటోలను పోస్ట్ చేసింది. కానీ వారు ఐశ్వర్య పేరును ప్రస్తావించలేదు.ఇది ఆమె అభిమానులను కలవరపెట్టింది. వారు తమ నిరాశని వక్తం చేశారు. దీంతో ఫెస్టివల్ టీమ్ స్పందించి ఐశ్వర్య పేరును చేర్చేలా కొత్త పోస్టును పెట్టింది.
77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మే 14న ప్రారంభమైంది. మే 25 వరకు కొనసాగుతుంది. ఇది ప్రపంచ చలనచిత్రాలలో అత్యుత్తమమైన చిత్రాలను జరుపుకునే అనేక చలనచిత్రాలు, ఈవెంట్‌లు మరియు ప్రముఖుల ప్రదర్శనలను కలిగి ఉంది.
Also Read: Viveka: వివేకా హత్య కేసు..కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే