Rambabu vs Jagan : జగన్ యాత్రకు దీటుగా రాంబాబు వస్తున్నాడు..ఏమన్నా సిద్ధమా..!!
- Author : Sudheer
Date : 31-01-2024 - 3:17 IST
Published By : Hashtagu Telugu Desk
ఏపీ (AP)లో ఎన్నికల వేడి ఏ రేంజ్ లో నడుస్తుందో తెలియంది కాదు..ఎవ్వరు..ఎక్కడ..ఏ విషయంలో తగ్గడం లేదు..సిద్ధం అని జగన్ (jagan) అంటే మీము సిద్ధం అంటూ ప్రతిపక్ష పార్టీలు (TDP-Janasena) అంటున్నాయి. కేవలం సభల్లో , సమావేశాల్లోనే కాదు సోషల్ మీడియా వేదికగా..ప్రచారంలో కూడా ఎవరికీ వారు అనిపించుకుంటున్నారు. ఇక ఇప్పుడు సినిమాల పరంగా కూడా తమ ప్రతాపం చూపించాలని చూస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సీఎం జగన్ జీవితం ఆధారంగా ‘యాత్ర 2’ (Yatra 2) రూపొందిన సంగతి తెలిసిందే. వైయస్సార్ (YSR) మరణం నుంచి జగన్ సీయం అయ్యే వరకు జరిగిన పరిణామాల నేపథ్యంలో తండ్రీ కొడుకుల కథగా దర్శకుడు మహి వి రాఘవ్ ఈ సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ ఏపీ ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిబ్రవరి 08 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు. ఇదిలా ఉంటె ఈ సినిమాకు పోటీగా పవన్ కళ్యాణ్ – పూరి కలయికలో తెరకెక్కిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu) చిత్రాన్ని ఫిబ్రవరి 07 న రీ రిలీజ్ చేస్తున్నారు.
కెమెరామెన్ గంగతో రాంబాబు 2012 లో విడుదలై సంచలనం సృష్ష్టించింది. ప్రత్యేక తెలంగాణ అంశం నడుస్తున్న క్రమంలో ఈ సినిమా రిలీజ్ కావడం ..ఇందులో సన్నివేశాలు ప్రత్యేక తెలంగాణ అంశానికి వ్యతిరేకంగా ఉండడం తో చాల చోట్ల సినిమా షోస్ పడలేదు. పడనివ్వలేదు. దీంతో నిర్మాతలకు నష్టం వాటిల్లింది. ఇక ఇప్పుడు జగన్ యాత్ర కు పోటీగా రాంబాబు ను దించుతున్నారు. మరి ఎప్పుడు ఏంజరుగుతుందో చూడాలి.
Read Also : AP Special Status : ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాలనీ ప్రజలకు పిలుపునిచ్చిన జేడీ