Kanchana 4: భారీ అంచనాలు రేపుతున్న కాంచన 4.. కీలక పాత్రలో స్టార్ నటులు
- Author : Balu J
Date : 08-06-2024 - 9:48 IST
Published By : Hashtagu Telugu Desk
Kanchana 4: కోలీవుడ్ నుంచి అత్యంత విజయవంతమైన హారర్ కామెడీ ఫ్రాంచైజీ కాంచనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ‘కాంచన 4’ షూటింగ్ డేట్ ను ప్రకటించగా, 2024 సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా సమాచారం ప్రకారం మృణాల్ ఠాకూర్ తమిళ పరిశ్రమలో అరంగేట్రం చేసే కాంచన 4లో కథానాయికగా నటించడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్టుల విషయంలో సెలెక్టివ్ గా వ్యవహరించే మృణాల్ తన పాత్ర సినిమాకు కీలకమైనప్పుడు మాత్రమే పాత్రలను అంగీకరిస్తుంది. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించి, నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఆయన స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో బెంజ్ అనే హారర్ థ్రిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. లారెన్స్ ఒకప్పుడు డాన్సర్ గా జీవితం మొదలుపెట్టి నటుడిగా, డైరెక్టర్ గా మారాడు. ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసి తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నాడు. లారెన్స్ సినిమాలకు తెలుగుతో పాటు బాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో కాంచన 4పై భారీ అంచనాలున్నాయి.