Mahesh-Rajamouli film: ‘మహేశ్, రాజమౌళి’ మూవీకి హీరోయిన్ ఫిక్స్.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో క్రేజ్ పెరిగింది.
- By Balu J Published Date - 12:11 PM, Sat - 17 September 22
‘బాహుబలి’తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’తో క్రేజ్ పెరిగింది. ఆయన డైరెక్షన్‌కి అందరూ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడి తదుపరి చిత్రం ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ హీరో మహేష్ బాబుతో సినిమా చేస్తానని రాజమౌళి గతంలోనే ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా తిరిగే సాహసికుడి కథగా సినిమా నేపథ్యాన్ని వివరించాడు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ అయిందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
రాజమౌళి సినిమాకు హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఎంపికైనట్లు సమాచారం. మేకర్స్ ఆమెను సంప్రదించారని, ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. కానీ, ఒప్పందం కుదుర్చుకోలేదని తెలుస్తోంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ‘RRR’ విదేశీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. అందుకే మహేష్ తో సినిమా తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఏకకాలంలో రూపొందనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి, మహేష్ కలిసి పని చేస్తామని పదేళ్ల క్రితమే ప్రకటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ ఘనవిజయం సాధించడంతో చాలా దేశాలు రాజమౌళిని సినిమాల గురించి మాట్లాడాతున్నాయి. ఇటీవలే ‘టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో పాల్గొన్నాడు.
మహేశ్‌తో సినిమాను భారీ స్థాయిలో తీయాలనుకుంటున్నట్లు వివరించారు. రాజమౌళితో సినిమా చేయబోతున్నందుకు మహేష్ బాబు హ్యాపీగా ఉన్నాడు. ‘‘రాజమౌళితో ఒక్క సినిమాకు పని చేయడం అంటే 25 సినిమాలకు పనిచేసినట్లే. సినిమాలో పాత్ర కోసం చాలా కష్టపడాలి. ఎందుకంటే సినిమా డిమాండ్ చేస్తుంది. మా కాంబినేషన్ సినిమా కోసం ఎదురుచూస్తున్నా. ఇది పాన్ ఇండియా సినిమా అవుతుంది. ఈ సినిమా దేశంలోని ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని మహేష్ బాబు అన్నారు.
Related News
Vidya Balan: స్మోకింగ్ అలవాటుపై విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు.. కామెంట్స్ వైరల్!
Vidya Balan: 2011లో ‘ది డర్టీ పిక్చర్’ అనే విజయవంతమైన చిత్రంలో నటించిన తర్వాత నటి విద్యాబాలన్ కు ధూమపాన వ్యసనం బారిన పడింది. పొగ వాసన అంటే తనకు ఇష్టమని, అయితే అది తన ఆరోగ్యానికి హాని కలిగించకపోతే మాత్రమే ధూమపానం చేస్తానని ఆమె అంగీకరించింది. 1980ల నాటి దక్షిణాది నటి సిల్క్ స్మిత పాత్రలో నటించిన ఈ చిత్రంలో పనిచేసిన అనుభవాన్ని బాలన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సిల్క్ స్మితను