Bunny Vasu : నంది అవార్డ్స్ పై నిర్మాత బన్నీ వాసు వ్యాఖ్యలు.. ఆస్కార్, నంది అవార్డు ఒక్కటే..
గత కొంతకాలంగా టాలీవుడ్ లో నంది అవార్డ్స్ చర్చగా మారింది. తాజాగా నిర్మాత బన్నీవాసు(Bunny Vasu) నంది అవార్డ్స్ పై వ్యాఖ్యలు చేశారు.
- Author : News Desk
Date : 24-05-2023 - 9:30 IST
Published By : Hashtagu Telugu Desk
గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో నంది అవార్డ్స్(Nandi Awards) పై ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉన్నారు. పలువురు సినీ ప్రముఖులు వీటిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సినిమా వాళ్లకు అధికారికంగా ఇచ్చే నంది అవార్డులు రాష్ట్రం విడిపోయాక రెండు తెలుగు(Telugu) రాష్ట్రాలు కూడా నంది అవార్డ్స్ గురించి పట్టించుకోవడం మానేశాయి.
పలువురు సినీ పెద్దలు కొంతకాలం క్రితం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో నంది అవార్డ్స్ గురించి మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో గత కొంతకాలంగా టాలీవుడ్ లో నంది అవార్డ్స్ చర్చగా మారింది. తాజాగా నిర్మాత బన్నీవాసు(Bunny Vasu) నంది అవార్డ్స్ పై వ్యాఖ్యలు చేశారు.
మలయాళంలో ఇటీవల హిట్ అయిన 2018 సినిమాను బన్నీవాసు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బన్నీ వాసు మీడియాతో మాట్లాడుతూ.. మన సినిమాకు ఆస్కార్ రావటం గర్వం కారణం. ఆస్కార్ అనేది చాలా పెద్ద గ్రేట్ అచీమెంట్. అలాగే నంది అవార్డ్స్ కూడా అంతే అఛీవ్మెంట్ గా భావిస్తాం. ఎందుకో కొన్ని సంవత్సరాల నుండి తెలుగు ప్రభుత్వాలు నంది అవార్డ్స్ ఇవ్వటం లేదు. సినీ పెద్దలను, ప్రభుత్వాలను నంది అవార్డ్స్ ఇచ్చేలా చూడమని కోరుకుంటున్నాను. నంది అవార్డ్స్ తెలుగు పరిశ్రమ చేసుకునే పండగ అని అన్నారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి నంది అవార్డ్స్ పై చర్చ మొదలైంది.
Also Read : Tiger Nageswara Rao : రవితేజ ఊర మాస్.. టైగర్ నాగేశ్వరరావు ఫస్ట్ లుక్ రిలీజ్..