Brahma Anandam Trailer : ‘బ్రహ్మా ఆనందం’ ట్రైలర్ చూసారా? బ్రహ్మానందం, ఆయన కొడుకు కలిసి నటిస్తున్న సినిమా..
మీరు కూడా బ్రహ్మ ఆనందం ట్రైలర్ చూసేయండి..
- By News Desk Published Date - 08:01 AM, Tue - 11 February 25
Brahma Anandam Trailer : ఎన్నో ఏళ్లుగా వెయ్యికి పైగా సినిమాలతో మనల్ని నవ్వించిన బ్రహ్మానందం ఇప్పుడు మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఒక వేళ సినిమాలు చేసినా చిన్న చిన్న పాత్రలే చేస్తున్నారు. ఈ క్రమంలో బ్రహ్మానందం తన తనయుడు రాజా గౌతమ్ తో కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేసాడు.
స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో RVS నిఖిల్ దర్శకత్వంలో బ్రహ్మానందం, రాజా గౌతమ్, సంపత్, వెన్నెల కిషోర్, తనికెళ్ళ భరణి, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలెక్కల్.. పలువురు కీలక పాత్రల్లో ఈ బ్రహ్మ ఆనందం సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ అవుతుండగా తాజాగా బ్రహ్మ ఆనందం ట్రైలర్ ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసారు.
మీరు కూడా బ్రహ్మ ఆనందం ట్రైలర్ చూసేయండి..
నిజ జీవితంలో తండ్రికొడుకులైన బ్రహ్మానందం, రాజా గౌతమ్ ఈ సినిమాలో తాత మనవడిగా నటిస్తున్నారు. మనవడు కష్టాల్లో ఉండి, డబ్బు అవసరమైతే తాత ఎలా సహాయపడ్డాడు అని కామెడీ ఎమోషనల్ గా ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా కోసం బ్రహ్మి ఫ్యాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు.
Also Read : Sankranthiki Vasthunnam : ఓటీటీలో రాకముందే టీవీలోకి.. సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సరికొత్త ప్రయోగం..