Sankranthiki Vasthunnam : ఓటీటీలో రాకముందే టీవీలోకి.. సూపర్ హిట్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సరికొత్త ప్రయోగం..
ఓటీటీ వచ్చిన తర్వాత మొదటిసారి ఓ పెద్ద సినిమా ఓటీటీలోకి రాకముందే టీవీ లోకి వస్తుంది.
- By News Desk Published Date - 07:44 AM, Tue - 11 February 25

Sankranthiki Vasthunnam : ఇటీవల సంక్రాంతి పండక్కి వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వచ్చి భారీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న రిలీజయి భారీ విజయం సాధించింది. దాదాపు 60 కోట్లతో సినిమా తీస్తే ఆల్మోస్ట్ 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వచ్చి పెద్ద హిట్ అయింది.
ఒక మాజీ పోలీసాఫీసర్ ఒక మిషన్ కోసం తన భార్య, మాజీ ప్రేయసితో కలిసి వెళ్తే ఏం జరిగింది అని కామెడీగా తెరకెక్కించారు ఈ సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా ఫుల్ గా నచ్చేసింది. అయితే ఇటీవల ఎంత పెద్ద సినిమాలు అయినా రిలీజ్ అయిన మూడు, నాలుగు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇక ఫ్లాప్ అయిన సినిమాలు అయితే రెండు వారాలకే వచ్చేస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమాలు అన్ని ఓటీటీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. కానీ ఓటీటీ వచ్చిన తర్వాత మొదటిసారి ఓ పెద్ద సినిమా ఓటీటీలోకి రాకముందే టీవీ లోకి వస్తుంది.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు ఛానల్ లో త్వరలోనే టెలికాస్ట్ కానుంది. ఓటీటీ రిలీజ్ కంటే ముందు టీవీలోనే రానుంది. ఈ విషయాన్నీ జీ తెలుగు అధికారికంగా ప్రకటించింది. అయితే ఇలా ఎందుకు అనుకుంటే.. ఈ సినిమా ఓటీటీ హక్కులు కూడా జీ 5 కొనుక్కుంది. అంటే ఓటీటీ, శాటిలైట్ హక్కులు రెండూ ఒకే సంస్థ కొనుక్కుంది కాబట్టి ఎందులో ముందు వేసినా వాళ్లకు వచ్చే ఇబ్బంది లేదు.
అంతే కాకుండా టీవీలో వేస్తే పెద్ద హిట్ సినిమా కాబట్టి యాడ్స్ ఎక్కువ తెచ్చుకోవచ్చు, టీఆర్పీ పెంచుకోవచ్చి అనే ఆలోచనతో ముందే టీవీలో వేస్తున్నారు. ఓటీటీలో వచ్చాక దానికి వచ్చే రెస్పాన్స్ దానికి వస్తుంది కాబట్టి టీవీలో వేసి మరింత మైలేజ్ పొందాలని జీ సంస్థ ఇలా చేస్తుంది. దీంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ముందే టీవీలోకి వస్తుండటంతో ఫ్యామిలీ ఆడియన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Get ready to relive the Sankranthi vibe again 💥😁#SankranthikiVasthunnam Coming Soon On #ZeeTelugu #SankranthiKiVasthunnamOnZeeTelugu#WorldTelevisionPremiereSankranthikiVasthunnam#FirstTVloVasthunnam #TVbeforeOTT #SVonTV@VenkyMama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/pIP6UUoNIY
— ZEE TELUGU (@ZeeTVTelugu) February 10, 2025