Kalki 2898 AD : కల్కి ట్రైలర్‌లో ‘బ్రహ్మానందం’ని చూశారా.. యానిమేషన్ పాత్రలో బలే ఉన్నారు..
కల్కి ట్రైలర్‌లో 'బ్రహ్మానందం'ని చూశారా. యానిమేషన్ పాత్రలో బలే ఉన్నారు.
- By News Desk Published Date - 07:04 PM, Thu - 30 May 24

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న మైథలాజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కల్కి 2898 ఏడి’. సి అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ కనిపించబోతుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని ప్రధాన పాత్రల్లో కనిపించబోతుండగా, మరికొంతమంది స్టార్స్ కూడా గెస్ట్ రోల్స్ తో సర్‌ప్రైజ్ చేయబోతున్నారట. మరి ఈ సినిమాలో కనిపించబోయే నటీనటులు ఎవరెవరు అనేది తెలుసుకోవాలంటే.. సినిమా రిలీజ్ వరకు ఎదురు చూడాల్సిందే.
కాగా ఈ సినిమా రిలీజ్ కంటే ముందు, ఒక యానిమేషన్ సిరీస్ ని మేకర్స్ ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్న సంగతి తెలిసిందే. బుజ్జి అండ్ భైరవ అనే టైటిల్ తో రాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ని నేడు రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో ప్రభాస్ అండ్ బుజ్జి పాత్రలతో పాటు మరో పాత్రని కూడా చూపించారు. యానిమేటెడ్ ఎఫెక్ట్ లో ఆ పాత్రని చూస్తుంటే.. అది బ్రహ్మానందం అని తెలుస్తుంది. యానిమేటెడ్ పాత్రలో బ్రహ్మి చూడడానికి బలే ఉన్నారు. మరి సిరీస్ లో ఈ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి.
ఈ సిరీస్ కథ 2898వ సంవత్సరంలో కాశీ చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఈ యానిమేషన్ సిరీస్ ని రేపటి (మే 31) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఈ సిరీస్ కథతోనే కల్కి సినిమా కథ మొదలవుతుందట. కాగా ఈ ట్రైలర్ తో కల్కి సినిమాటిక్ యూనివర్స్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసారు. అంటే, ఈ మూవీ కూడా అనేక భాగాలుగా రాబోతుందని అర్థమైపోయింది.