Balakrishna : బాలకృష్ణ అసలు కథే వినడా..నిజమేనా..?
బాలకృష్ణతో మూడు సినిమాలు చేసినా ఒక్కసారి కూడా ఆయనకు కథ చెప్పే అవసరం రాలేదని శ్రీను చెప్పుకొచ్చారు
- Author : Sudheer
Date : 06-10-2023 - 12:38 IST
Published By : Hashtagu Telugu Desk
ఓ చిన్న హీరో అయినా , పెద్ద హీరో ఐన కథ వినకుండా సినిమాకు ఓకే చెప్పాడు. కానీ నందమూరి బాలకృష్ణ మాత్రం అసలు కథే వినకుండా సినిమాకు ఓకే చెపుతాడట. ఈ మాట అంటున్నది ఎవరో కథ బాలకృష్ణ (Balakrishna) కెరియర్ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బోయపాటి (Boyapati).
బోయపాటి శ్రీను – బాలకృష్ణ కాంబో అంటే అభిమానులకే కాదు సినీ లవర్స్ కు కూడా పెద్ద పండగనే. వీరిద్దరి కలయికలో సింహ , లెజెండ్ , అఖండ చిత్రాలు వచ్చి భారీ విజయాలను అందుకున్నాయి. అలాంటి హ్యాట్రిక్ విజయాలను అందజేసిన బోయపాటి..తాజాగా బాలకృష్ణ గురించి పలు ఆసక్తికర విషయాలను తెలిపి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసాడు. బాలకృష్ణతో మూడు సినిమాలు చేసినా ఒక్కసారి కూడా ఆయనకు కథ చెప్పే అవసరం రాలేదని శ్రీను చెప్పుకొచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
తాను డైరెక్టర్ అంటే కథ కూడా అడగకుండా బాలకృష్ణ సినిమా చేస్తాడని బోయపాటి శ్రీను తెలిపాడు. ఒకవేళ కథ చెబుతునాన్న వద్దు బ్రదర్ మీరు ఉన్నారు కదా అని బాలకృష్ణ అంటుంటాడని..బాలకృష్ణతో తనకున్న బాండింగ్ అలాంటిదని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే వస్తున్నానని చెప్పుకొచ్చారు. షూటింగ్ పూర్తయిన తర్వాతే బాలకృష్ణకు సినిమాను చూపిస్తుంటానని బోయపాటి శ్రీను చెప్పాడు. బాలకృష్ణతో తప్పకుండా అఖండ 2 సినిమా ఉంటుందని బోయపాటి శ్రీను క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ, బాబీ సినిమా పూర్తయిన తర్వాతే అఖండ 2 సెట్స్‌ఫైకి వస్తుందని ప్రకటించాడు. రీసెంట్ గా బోయపాటి రామ్ తో స్కంద మూవీ చేసాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది.
Read Also : Hyderabad : KTR అంటే కోట్ల రూపాయిలు తినే రాబందు..కూకట్ పల్లి లో పోస్టర్లు దర్శనం