Prabhas Record: బాక్సాఫీస్ కింగ్ ఫ్రభాస్, 1979 స్క్రీన్లలో సలార్ రిలీజ్!
గత సినిమాలు నిరాశపర్చినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సలార్ మూవీ కూడా రికార్డులు నెలకొల్పబోతోంది.
- By Balu J Published Date - 03:29 PM, Tue - 18 July 23
ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతున్నాయి. లోకల్ టు గ్లోబల్ అంటూ వివిధ ప్రపంచ దేశాల్లో సత్తా చాటుతున్నాయి. జపాన్, నేపాల్, యూఎస్ లాంటి దేశాల్లో మన తెలుగు సినిమాలు ఊహించని విధంగా కలెక్షన్లను సాధిస్తున్నాయి. బాహుబలి-2, ఆర్ఆర్ఆర్, పఠాన్ లాంటి సినిమాలు వెయ్యికి పైగా స్క్రీన్లలో రిలీజవడంతో హాలీవుడ్ సినిమాల స్థాయిలో సందడి కనిపించింది.
అయితే ఇప్పటిదాకా రిలీజ్ పరంగా ఉన్న రికార్డులన్నింటినీ కూడా ప్రభాస్ కొత్త చిత్రం సలార్ కొట్టేయబోతోంది. ఈ సినిమాను ఏకంగా 1979+ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించడం విశేషం. ప్రత్యంగిర సినిమాస్ సలార్ సినిమా ఉత్తర అమెరికా హక్కులను దక్కించుకుంది. ఆ సంస్థ ఏకంగా 1979+ స్క్రీన్లలో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇండియన్ సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ ఎవర్ రిలీజ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రికార్డు కంటే 400-500 దాకా స్క్రీన్లు ఎక్కువే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు.
అయితే తాజాగా USA లో ప్రభాస్ రేంజ్ తెలిసేలా భారీ కార్ ర్యాలీ చేపట్టారు ఆయన అభిమానులు. ప్రాజెక్ట్ K టీ షర్ట్స్ ధరించి US రోడ్లపై రయ్ రయ్ అంటూ స్పీడు పెంచారు. ఇందుకు సంబంధించిన వీడియోను వైజయంతి మూవీస్ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. ఇది కదా ప్రభాస్ రేంజ్ అంటే అంటూ ఈ వీడియో చూసి ప్రభాస్ ఫ్యాన్స్ కాలర్ ఎగిరేస్తున్నారు.
Also Read: Telangana High Court: కేసీఆర్ కు షాక్.. బీఆర్ఎస్ కు హైకోర్టు నోటీసులు
Related News
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ కెరీర్ ట్రాక్ లో పడేనా.. ?
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ప్రభాస్ లతో ‘హరి హర వీరమల్లు’, ‘రాజాసాబ్’ చిత్రాల్లో నటిస్తోంది. ఈ ఇద్దరు హీరోలతో నిధికి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. నిధి బ్యాడ్ టైం ఎదుర్కొంటోందని, ఇప్పుడు ఆమె తన కెరీర్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పీరియాడిక్ డ్రామాలో పవన్ కు ప్రేమికురాలిగా నటిస్తుండటంతో హరి హర వీరమల్�