NBK108 Update: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్.. క్రేజీ అప్డేట్ ఇదిగో!
బాలకృష్ణ, అనిల్ రావిపుడి మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ద్రుష్టిని కూడా ఆకర్షిస్తోంది.
- By Balu J Published Date - 01:02 PM, Wed - 10 May 23
ఒకరు మాస్ లో (Mass) ఫుల్ ఫాలోయింగ్ ఉన్న హీరో, మరొకరు కమర్షియల్ చిత్రాలను తనదైన స్టైయిల్ లో తెరకెక్కించడంలో సిద్ధహస్తడు (Director). అలాంటి క్రేజీ కాంబినేషన్ లో సినిమా రూపుదిద్దుకుంటుందంటే భారీ అంచనాలు ఏర్పడటం ఖాయమే. దర్శకుడు అనిల్ రావిపుడితో నందమూరి బాలకృష్ణ NBK108 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై అటు ప్రేక్షకుల్లోను, ఇటు టాలీవుడ్ లోనూ మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బాలీవుడ్ (Bollwood) నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది టాలీవుడ్లో ఆయనకు మొదటి సినిమా అవుతుంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. అర్జున్ రాంపాల్ సెట్స్‌లో అడుగు పెట్టె ముందు బాలకృష్ణ పాపులర్ డైలాగ్ ‘ఫ్లూట్ జింక ముందు ఊద..సింహం ముందర కాదు’ చెప్పి ఆశ్చర్యపర్చాడు. బాలకృష్ణ, అనిల్ రావిపుడి మూవీ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ ద్రుష్టిని కూడా ఆకర్షిస్తోంది.
అర్జున్ రాంపాల్ ట్విట్టర్లో ఇలా రియాక్ట్ అయ్యాడు “NBK108 టీమ్‌తో నా సౌత్ అరంగేట్రం చేస్తున్నాను. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇదంతా సరదాగా సాగిపోతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. ధన్యవాదాలు’’. కాగా ఈ నటుడు పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాతో సౌత్ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ తెలియని కారణాల వల్ల అది జరగలేదు. అతని స్థానంలో బాబీ డియోల్ తీసుకున్నారు. ఇప్పుడు బాలయ్య మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు.
Flutu Jinka mudhu Kadu. Simha mundhu kandu
Playing a flute won’t scare a lion. #NandamuriBalakrishna@AnilRavipudi @MsKajalAggarwal @SreeLeela14 @MusicThaman @sahugarpati7 @harish_peddi @Shine_Screens #NBK108 pic.twitter.com/UOnJpniXb9— arjun rampal (@rampalarjun) May 10, 2023
Also Read: Sudha Murthy Voted: ఓటేసిన సుధామూర్తి, ఓటుహక్కుపై యువతకు సందేశం!
Related News
Sabari: ‘శబరి’ టైటిల్ పెట్టడం వెనుక అసలు ఉద్దేశం అదే – దర్శకుడు అనిల్ కాట్జ్ ఇంటర్వ్యూ
Sabari: విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. దర్శకులు బి గోపాల్, ఏఎస్ రవికుమార్ చౌదరి, మదన్ దగ్గర పలు చిత్రాలకు పని చేసిన అనిల్ కాట్జ్ ‘శబరి’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మే 3న సినిమా పాన్ ఇండియా రిలీజ్ కానున్న నేపథ్యంలో దర్శకుడు అనిల్ కా�