Rajinikanth : రజిని కూలీలో బాలీవుడ్ స్టార్ సర్ ప్రైజ్..!
రజినితో పాల్గొన్న షూటింగ్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి మళ్లీ డిలీట్ చేశారు. ఐతే ఉపేంద్ర సినిమాలో ఉన్నాడన్న విషయాన్ని లోకేష్ సీక్రెట్
- By Ramesh Published Date - 11:55 PM, Tue - 27 August 24

సూపర్ స్టార్ రజినికాంత్ (Rajinikanth) లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూలీ. ఖైదీ, విక్రం సినిమాలతో డైరెక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న లోకేష్ కనకరాజ్ సూపర్ స్టార్ రజినితో కూలీ అంటూ మరో క్రేజీ అటెంప్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాను సూపర్ స్టార్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు లోకేష్. ఆమధ్య వచ్చిన టీజర్ కి మిశ్రమ స్పందన రాగా నెక్స్ట్ వదిలే కంటెంట్ తో గూస్ బంప్స్ వచ్చేలా చేయాలని చూస్తున్నాడు.
ఇక లేటెస్ట్ గా సినిమాలో రజినితో పాటుగా చాలా సర్ ప్రైజ్ లు ప్లాన్ చేస్తున్నాడట లోకేష్. ఇప్పటికే సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడని టాక్. ఆయనే స్వయంగా రజినితో పాల్గొన్న షూటింగ్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసి మళ్లీ డిలీట్ చేశారు. ఐతే ఉపేంద్ర సినిమాలో ఉన్నాడన్న విషయాన్ని లోకేష్ సీక్రెట్ గా ఉంచాలని అనుకోగా అది కాస్త బయట పెట్టి షాక్ ఇచ్చాడు ఉపేంద్ర.
ఇదిలాఉంటే కూలీ (Coolie) సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో కూడా క్యామియో ఇస్తారని టాక్. ఇంతకీ ఎవరా బాలీవుడ్ స్టార్ అంటే ఆమీర్ ఖాన్ (Aamir Khan) అని తెలుస్తుంది. రజిని కూలీ సినిమాలో ఆమీర్ ఖాన్ ఒక సర్ ప్రైజ్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తుంది. సౌత్ సినిమాల మీద ఆసక్తి ఉన్నా ఇప్పటివరకు ఇక్కడ సినిమాల్లో ఆమీర్ ఖాన్ నటించలేదు.
ఐతే మొదటిసారి రజినికాంత్ కూలీ కోసం ఆ అటెంప్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సూపర్ స్టార్ రజిని సినిమాతో సౌత్ ఎంట్రీ ఇస్తున్నాడు ఆమీర్ ఖాన్. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అన్నది తెలియదు కానీ ఇదే నిజమైతే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
Also Read : Sudheer Babu : దసరా రేసులో ఒకే ఒక్కడు..!