NTR Devara Special Song : దేవర ఐటం సాంగ్ కోసం ఆమెను దించుతున్నారా..?
NTR Devara Special Song యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సినిమాపై
- Author : Ramesh
Date : 03-10-2023 - 1:47 IST
Published By : Hashtagu Telugu Desk
NTR Devara Special Song యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర సినిమా ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని సినిమాపై మరింత అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. సినిమాలో యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని అండర్ వాటర్ ఫైట్ లో ఎన్టీఆర్ అదరగొట్టేశాడని టాక్ రాగా ఇప్పుడు సినిమాలో స్పెషల్ సాంగ్ గురించి వచ్చిన క్రేజీ అప్డేట్ ఫ్యాన్స్ కిక్ కిక్ ఇస్తుంది. స్టార్ సినిమాలో స్పెషల్ ఐటం సాంగ్స్ అనేవి చాలా కామన్. సరైన టైం లో పడితే ఆ సాంగ్ రేంజ్ వేరేలా ఉంటుంది.
పుష్ప 1 లో ఉ అంటావా మావా సాంగ్ దేశం మొత్తం ఊపేసింది. ఇప్పుడు దేవర సినిమాలో కూడా అలాంటి సాంగ్ నే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఇంతకీ దేవరలో స్పెషల్ సాంగ్ ఎవరు చేస్తున్నారు అంటే సారా అలీ ఖాన్ అని తెలుస్తుంది.
Also Read : Prabhas Salaar : ప్రభాస్ సలార్ లో ఎన్టీఆర్, యశ్..?
ఆల్రెడీ దేవర (Devara) సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. ప్రభాస్ (Prabhas) ఆదిపురుష్ లో రావణుడిగా నటించిన సైఫ్ అది బాలీవుడ్ సినిమా లెక్క వస్తుంది కాబట్టి సౌత్ లో టాలీవుడ్ లో సైఫ్ చేస్తున్న మొదటి సినిమా దేవర అనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో సారా కూడా స్పెషల్ సాంగ్ చేయడం తండ్రి కూతుళ్లు ఇద్దరు సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.
ఎన్టీఆర్ (NTR) స్పీడుకి మ్యాచ్ చేసేలా సారా డ్యాన్స్ చేస్తే మాత్రం ఆమెకి తెలుగులో వరుస ఛాన్స్ లు వస్తాయని చెప్పొచ్చు. అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న దేవర సినిమా సాంగ్స్ కూడా వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడట అనిరుద్.
We’re now on WhatsApp. Click to Join