Ducati Brand Ambassador : డుకాటీ బైక్స్ బ్రాండ్ అంబాసిడర్ గా మన రాంబో
Ducati Brand Ambassador : లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ "డుకాటీ"కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక యంగ్ హీరో అపాయింట్ అయ్యాడు..
- By Pasha Published Date - 03:39 PM, Tue - 8 August 23

Ducati Brand Ambassador : లగ్జరీ మోటార్ సైకిల్ బ్రాండ్ “డుకాటీ”కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒక యంగ్ హీరో అపాయింట్ అయ్యాడు..
డుకాటీ బైక్స్ అంటే స్టైల్, హుందాతనం, పనితీరుకు మారుపేరు…
లగ్జరీ మోటార్ సైక్లింగ్‌లో డుకాటీ అగ్రగామి..
అలాంటి కంపెనీకి ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ యాక్టర్ రణవీర్ సింగ్ నియమితులు అయ్యారు.
Also read : Germany: బయటపడిన రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు.. ఏం చేశారు తెలుసా?
ఇక నుంచి ఇండియాలో సోషల్ మీడియా హ్యాండిల్స్ సహా ఇంటర్నెట్‌లో డుకాటీ బ్రాండ్‌ను రణవీర్ ప్రమోట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే కంపెనీ ప్రచార కార్యక్రమాలు, కొత్త లాంచ్‌లలో రణవీర్ సింగ్ పాల్గొంటారని డుకాటీ వెల్లడించింది. ఈవివరాలను రణ్‌వీర్ సింగ్ కూడా ధృవీకరించారు. తాజాగా మంగళవారం ఉదయం “డయావెల్ V4” మోడల్ బైక్ ను ఇండియా మార్కెట్లోకి Ducati లాంచ్ చేసింది. ఈ కార్యక్రమం సందర్భంగానే రణవీర్ సింగ్‌ను ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా(Ducati Brand Ambassador) ప్రకటించింది. Ducati “డయావెల్ V4” మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 25.91 లక్షలు (ఎక్స్-షోరూమ్).
Also read : Tomato: టమాటాకు పెరుగుతున్న రక్షణ.. పొలాల్లో ఏకంగా సీసీ కెమెరాలు ఏర్పాటు?
న్యూఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, అహ్మదాబాద్, చండీగఢ్‌లోని అన్ని డుకాటీ స్టోర్లలో దీని విక్రయాలు జరుగుతున్నాయి. డుకాటీ కంపెనీ ఈ బైక్ కు ప్రతి 60,000 కి.మీ డ్రైవ్ కి వాల్వ్ క్లియరెన్స్ చెక్‌ని అందిస్తోంది. ఇందులో 20 లీటర్ల కెపాసిటీతో పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఫుట్ రెస్ట్‌లు, ఒమేగా DRL హెడ్‌లైట్, మల్టీ పాయింట్ LED రియర్ లైట్ యూనిట్, ముడుచుకునే హ్యాండిల్, డైనమిక్ ఫ్రంట్ ఫ్లాషర్‌లు, 50 mm ఫోర్క్, మోనో షాక్ అబ్జార్బర్, డబుల్ 330 mm డిస్క్‌లు, బ్రెంబో స్టైల్మా మోనోబ్లాక్ కాలిపర్‌లతో సర్దుబాటు చేయగల బ్రేకింగ్ సిస్టమ్ లు Ducati “డయావెల్ V4” బైక్స్ లో ఉంటాయి.