Bobby Deol in NBK109 బాబీతో బాబీ.. బాలయ్య 109లో యానిమల్ విలన్ ఢీ..!
Bobby Deol in NBK109 యానిమల్ సినిమాతో హీరోగా రణ్ బీర్ కపూర్ తో పాటుగా విలన్ గా నటించిన బాబీ డియో కి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని బాబీ డియోల్
- By Ramesh Published Date - 11:18 PM, Sat - 27 January 24

Bobby Deol in NBK109 యానిమల్ సినిమాతో హీరోగా రణ్ బీర్ కపూర్ తో పాటుగా విలన్ గా నటించిన బాబీ డియో కి కూడా సూపర్ క్రేజ్ వచ్చింది. కొన్నాళ్లుగా సరైన ఫాం లో లేని బాబీ డియోల్ విలన్ గా స్టార్ డం తెచ్చుకున్నారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ లేని సూపర్ జోష్ లో ఉన్నారు బాబీ డియోల్.
We’re now on WhatsApp : Click to Join
ఈ క్రమంలో యానిమల్ తర్వాత బాబీకి వరుస ఛాన్స్ లు వస్తున్నాయి. యానిమల్ రిలీజ్ వెంటనే సూర్య కంగువలో ఛాన్స్ అందుకున్నాడు బాబీ. శివ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఉదిరన్ పాత్రలో నటిస్తున్నాడు.
ఈమధ్యనే సినిమాలో బాబీ డియోల్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా తో పాటుగా నందమూరి బాలకృష్ణ కె.ఎస్ బాబీ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా బాబీ ఛాన్స్ అందుకున్నాడని టాక్. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ బాలయ్య కాంబో ఫిక్స్ అయ్యింది. అయితే ఈ కాంబో మీద భారీ అంచనాలు ఉన్నాయి.
బాలయ్య సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బాబీ డియోల్. యానిమల్ సినిమాలో ప్రతినాయకుడిగా బాబీ డియోల్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరచుకున్నారు. ఆ సినిమా రిలీజ్ తర్వాత అటు బాలీవుడ్ లోనే కాదు సౌత్ సినిమాల్లో కూడా బాబీ ఛాన్స్ లు అందుకుంటున్నారు.
బాబీ ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ట్రెండ్ అవుతున్నాడు. అటు కంగువ సినిమాతో పాటుగా తెలుగులో బాలయ్య సినిమాలో నటించడం కెరీర్ కి మరింత ఊపు తెస్తుందని చెప్పొచ్చు.