Bipasha Basu Blessed: ఆడబిడ్డకు జన్మనిచ్చిన బిపాసా బసు!
బాలీవుడ్ వరుసగా గుడ్ న్యూస్ లను అందిస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బిపాసా ఆమె భర్తతో
- Author : Balu J
Date : 12-11-2022 - 4:59 IST
Published By : Hashtagu Telugu Desk
బాలీవుడ్ వరుసగా గుడ్ న్యూస్ లను అందిస్తోంది. తాజాగా బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. తాము తల్లిదండ్రులు అయినందుకు చాలా గర్వంగా ఉందని ఫీల్ అయ్యారు. ఆగస్ట్ 16న తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు స్టార్ కపుల్ స్టేట్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇన్‌స్టాగ్రామ్‌లో బిపాషా తన ప్రెగ్నెన్సీకి సంబంధించిన విషయాన్ని కూడా పోస్ట్ చేసింది.
“కొత్త సమయం, కొత్త దశ, కొత్త కాంతి. మేం ఈ జీవితాన్ని ప్రారంభించాము. వ్యక్తిగతంగా ఒకరినొకరు కలిశాం. అప్పటినుండి ఇద్దరం.. కానీ.. ఇంత త్వరగా ఇద్దరుగా ఉన్న మనం ఇప్పుడు ముగ్గురం అవుతాం. మన ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే సృష్టి. మా పాప త్వరలో మాతో చేరి మా ఆనందాన్ని పెంచుతుంది” అని ఆమె రాసుకొచ్చింది. కాగా ఇటీవలే అలియా భట్, రణ్ బీర్ కపూర్ జంట కూడా పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.