Bimbisara Director: బింబిసార డైరెక్టర్ కు బంపరాఫర్.. రజనీతో స్టోరీ డిస్కషన్స్!
సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లలోనూ జోరుగా సినిమాలు చేస్తున్నాడు. రజనీ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ,
- By Balu J Published Date - 05:32 PM, Fri - 21 October 22

సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లలోనూ జోరుగా సినిమాలు చేస్తున్నాడు. రజనీ సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, ఆయన క్రేజ్ కారణంగా ‘పెట్టా, ‘దర్బార్, ‘అన్నత్తే’ లాంటి సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం నెల్సన్ దర్శకత్వంలో ‘జైలర్’ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత ఓ తెలుగు డైరెక్టర్ తో పనిచేస్తారని సమాచారం. ‘బింబిసార’తో ఆకట్టుకున్న యువ దర్శకుడు వసిష్ట్ ప్రస్తుతం ‘బింబిసార 2’ స్క్రిప్ట్‌ను పూర్తి చేయడంపై దృష్టి సారించాడు.
ఇటీవల రజనీకాంత్ కోసం ఓ కథను సిద్ధం చేశాడు. ‘తలైవా’కు నచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీ చేతిలో రెండు సినిమాలు ఉన్నందున ఈ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాకపోవచ్చు. అలాగే వసిష్ట్ తన తదుపరి ప్రాజెక్ట్‌కి వెళ్లే ముందు ‘బింబిసార 2’ని పూర్తి చేయాలి. మరి రజనీకాంత్ తో వశిష్ట సినిమా ఎప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ అవుతుందో చూడాలి.