Bigg Boss 8 Wild Card Entries : బిగ్ బాస్ 8.. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్.. మొదటి రోజే షాక్..!
Bigg Boss 8 Wild Card Entries గంగవ్వ, అవినాష్, మెహబూబ్, రోహిణి, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ, గౌతం కృష్ణ ఉన్నారు. బిగ్ బాస్ లో ఐదు వారాల నుంచి ఉన్న వారుని ఓజీ గా ఫిక్స్ చేయగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ
- By Ramesh Published Date - 09:19 AM, Mon - 7 October 24

Bigg Boss 8 Wild Card Entries బిగ్ బాస్ సీజన్ 8 లో ఆరో వారానికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేశారు. హౌస్ లో ఆదివారం నైనిక ఎలిమినేట్ అవ్వడంతో 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా మరో ఎనిమిది మందిని హౌస్ లోకి వైల్డ్ కార్డ్ గా పంపించారు. ఐతే ప్రతి సీజన్ లో వైల్డ్ ఎంట్రీగా కొత్త వాళ్లని పంపిస్తారు కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో రీ లోడ్ అంటూ ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్ పీరియన్స్ చేసిన వారిని తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు హౌస్ ఎక్స్ పీరియన్స్ ఉన్న వారు బిగ్ బాస్ కి వచ్చారు.
అందులో గంగవ్వ, అవినాష్, మెహబూబ్, రోహిణి, టేస్టీ తేజ, నయని పావని, హరితేజ, గౌతం కృష్ణ ఉన్నారు. బిగ్ బాస్ లో ఐదు వారాల నుంచి ఉన్న వారుని ఓజీ గా ఫిక్స్ చేయగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వారిని రాయల్ క్లాన్ గా ఫిక్స్ చేశారు. ఐతేకాదు హౌస్ లోకి వెళ్లిన వైల్డ్ కార్డ్స్ ఆల్రెడీ ఉన్న కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు కూడా పెట్టాడు బిగ్ బాస్.
సీజన్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డ్..
అందరు ఏమో కానీ గంగవ్వ, అవినాష్ కలిసి ఆడిన బాల్ టాస్క్ ఆడియన్స్ ని మెప్పించింది. సీజన్ 4 లో గంగవ్వ ఐదు వారాలకే హౌస్ నుంచి బయటకు వెళ్లింది. ఇప్పుడు సీజన్ 8 లో మళ్లీ వైల్డ్ కార్డ్ గా ఐదు వారాల తర్వాత వచ్చింది. సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా వచ్చిన పాత కంటెస్టెంట్స్ ని చూసి కొంత ఆల్రెడీ హౌస్ లో ఉన్న వారికి షివరింగ్ మొదలైందని చెప్పొచ్చు.
బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8) లో మొన్నటిదాకా జరిగింది ఒక లెక్కైతే ఇక నుంచి జరగబోయేది మరో పెక్క అనేలా ఉంది. ఏది ఏమైనా ఆడియన్స్ కు కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ ఇచ్చేందుకు సిద్ధమని తెలుస్తుంది.
Also Read : Women Commandos : మహిళా కమాండోల ధైర్యసాహసాలు.. మావోయిస్టుల ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర