BiggBoss 8 : నాగార్జున కన్నా మూడు రెట్లు ఎక్కువ..!
BiggBoss 8 నాగార్జున హోస్టింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే 3 వ సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న 8వ సీజన్ వరకు నాగార్జున
- By Ramesh Published Date - 04:54 PM, Mon - 9 September 24

BiggBoss 8 బిగ్ బాస్ తెలుగు హోస్ట్ అంటే కేరాఫ్ అడ్రస్ గా కింగ్ నాగార్జున మారిపోయారు. తెలుగులో బిగ్ బాస్ హోస్ట్ గా యంగ్ టైగర్ ఎన్ టీ ఆర్ మొదటి సీజన్ హోస్ట్ చేయగా సెకండ్ సీజన్ ను నాని హోస్ట్ గా చేసి అలరించారు. ఇక థర్డ్ సీజన్ నుంచి కింగ్ నాగార్జునని హోస్ట్ గా పెట్టి సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. నాగార్జున హోస్టింగ్ టాలెంట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐతే 3 వ సీజన్ నుంచి ప్రస్తుతం జరుగుతున్న 8వ సీజన్ వరకు నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.
ఐతే తెలుగుతో పాటు అన్ని సౌత్ భాషల్లో బిగ్ బాస్ ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తమిళంలో బిగ్ బాస్ ను యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నారు. తమిళ్ లో కూడా 7 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8వ సీజన్ కు రెడీ అవుతుంది. ఐతే ఈసారి తన సినిమాల కమిట్మెంట్ వల్ల బిగ్ బాస్ చేయడం కుదరదని ప్రకటించారు కమల్ హాసన్.
తమిళ్ కొత్త హోస్ట్ కోసం వేట..
బిగ్ బాస్ 8 తమిళ్ కొత్త హోస్ట్ కోసం వేట మొదలు పెట్టారు. శింబు పేరు చర్చల్లోకి రాగా హోస్ట్ గా ఆయన చేయడం కష్టమని చెప్పేశారట. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ రేసులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఉన్నారని తెలుస్తుంది. కోలీవుడ్ లో నటుడిగా సూపర్ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి (Vijay Sethupathi) బిగ్ బాస్ హోస్ట్ గా అనగానే ఆడియన్స్ లో ఎగ్జైట్ మెంట్ మొదలైంది.
ఐతే విజయ్ సేతుపతి కోసం బిగ్ బాస్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. సీజన్ 8 హోస్ట్ గా చేస్తే 60 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తామని చెప్పారట. విజయ్ సేతుపతి ఒక సినిమాకు 20 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అంటే 3 సినిమాల రెమ్యునరేషన్ బిగ్ బాస్ ద్వారా తీసుకుంటున్నాడని టాక్. తెలుగులో కింగ్ నాగార్జున (Nagarjuna) మాత్రం 20 నుంచి 30 కోట్ల దాకా పారితోషికం తీసుకుంటున్నారు. మరి ఈ రెమ్యునరేషన్ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ విజయ్ సేతుపతి రెమ్యునరేషన్ విన్న ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయిపోతుంది.
Also Read : Autopsy Document Missing : జూనియర్ వైద్యురాలి పోస్టుమార్టం డాక్యుమెంట్ మిస్.. దీదీ సర్కారుపై ‘సుప్రీం’ ఫైర్