Bigg Boss 7 : బోలే శావలి టాలెంట్ అర్ధం కావట్లేదు..!
Bigg Boss 7 బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాల క్రితం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బోలే శావలి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఐదుగురిలో బోలే శావలి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్
- By Ramesh Published Date - 10:27 AM, Tue - 24 October 23

Bigg Boss 7 బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాల క్రితం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బోలే శావలి ఎంట్రీ ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన ఐదుగురిలో బోలే శావలి వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారు. స్వతహాగా మ్యూజిక్ కంపోజర్ సింగర్ కావడం వల్ల బోలే శావలి కొద్దిగా యాక్టివ్ గా ఉంటాడు. అయితే అదే ఆయనకు హౌస్ లో రివర్స్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో బోలే శావలి తన ఆట తీరు అంతగా చూపించకపోయినా మాటలతో మెప్పించాలని చూస్తున్నాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ టైం లో బూతులు మాట్లాడి నాగార్జున చేత ఈ వారం క్లాస్ పీకించుకున్న బోలే శావలి. ఈ వారం కాస్త తగ్గినట్టు అనిపిస్తున్నాడు.
సోమవారం జరిగిన నామినేషన్స్ లో బోలే శావలి చాలా కంట్రోల్ అయ్యాడు. అయితే శోభా శెట్టి (Shobha Shetty), ప్రియాంకా ఇద్దరు బోలే మీద ఎటాక్ చేస్తున్నారు. బోలే టాలెంట్ ని అర్ధం చేసుకోలేని ఈ ఇద్దరు హౌస్ లో అతనంటే పడదన్నట్టుగా ఉంటున్నారు. మండే ఎపిసోడ్ లో శోభా శెట్టి అయితే బోలే తో వాగ్వివాదానికి దిగింది. ఆయన ఏం చెప్పినా సరే నో అనేసింది.
బోలే శావలి (Bole Shavali) కొన్ని చోట్ల తగ్గుతూ.. కొన్ని చోట్ల మాటలతో వారిని అడ్డు పడుతూ వస్తున్నాడు. నామినేషన్స్ (Nominations) లో కాకుండా బోలే టాస్కుల్లో కూడా తన సత్తా చాటితే అతని గురించి ఆడియన్స్ కాస్త ఆలోచించే అవకాశం ఉంటుంది. మరి బోలే శావలి ఈ వారం నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి సేఫ్ అవుతాడా లేదా ఎలిమినేట్ అవుతాడా అన్నది చూడాలి.
Also Read : Prabhas : అసంతృప్తిలో ప్రభాస్ ఫ్యాన్స్.. ఇలా చేశారేంటో..!