Bigg Boss: బిగ్‌బాస్ 9 కంటెస్టెంట్ల జాబితా లీక్.? సోషల్ మీడియాలో చర్చ హీట్..!
Biggboss: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 9 ముస్తాబైంది. ఇకమరి మూడు రోజుల్లో, ఈనెల 7న గ్రాండ్‌గా కొత్త సీజన్ ప్రారంభం కానుంది.
- By Kavya Krishna Published Date - 10:00 AM, Thu - 4 September 25

Bigg Boss: తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 9 ముస్తాబైంది. ఇకమరి మూడు రోజుల్లో, ఈనెల 7న గ్రాండ్‌గా కొత్త సీజన్ ప్రారంభం కానుంది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారన్న దానిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలో, కంటెస్టెంట్ల జాబితా పేరుతో ఒక లిస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈసారి నిర్వాహకులు “డబుల్ హౌస్ – డబుల్ డోస్” అన్న కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా సెలబ్రిటీలతో పాటు, “అగ్నిపరీక్ష” పేరుతో ఎంపిక చేసిన ఐదుగురు సామాన్యులను కూడా హౌస్‌లోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో బయటికొచ్చిన జాబితా ప్రకారం, వినోదానికి ఈ సీజన్‌లో కొదవ ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
AI Steth : గుండె జబ్బులను కనిపెట్టే కొత్త ఏఐ స్టెత్.. కేవలం సెకన్లలోనే ఖచ్చితమైన ఫలితాలు!
ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి భార్య, నటి నిక్కీ గల్రానీ ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లో కనిపించబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అలాగే ‘నరసింహనాయుడు’ మూవీ ఐటమ్ సాంగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న ఆశా షైనీ కూడా కంటెస్టెంట్లలో ఒకరిగా ఉండొచ్చని టాక్. బుల్లితెర వైపు చూస్తే ‘నా పేరు మీనాక్షి’ ఫేమ్ నవ్య స్వామి, ‘గుప్పెడంత మనసు’ హీరో ముఖేశ్ గౌడ, ‘కోయిలమ్మ’ సీరియల్ నటి తేజస్విని గౌడ పేర్లు వినిపిస్తున్నాయి.
ఇవే కాకుండా, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయెల్, డ్యాన్స్ షోతో పాపులర్ అయిన శ్రేష్టి వర్మ, ‘రాను బొంబాయికి రాను’ పాటతో గుర్తింపు పొందిన సింగర్ రాము రాథోడ్, అలాగే సోషల్ మీడియాలో ‘చిట్టి పికిల్స్’తో వైరల్ అయిన అలేఖ్య పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. సామాన్యుల కోటాలో ప్రియా శెట్టి, పవన్ కల్యాణ్, నాగ ప్రశాంత్ పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే ఈ లిస్టులో ఉన్న పేర్లలో ఎంతవరకు నిజం ఉందనేది షో ప్రారంభమైన తర్వాతే తేలుతుంది. కానీ ప్రస్తుతం మాత్రం ఈ జాబితా సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
Parivartini Ekadashi 2025: రేపే పరివర్తిని ఏకాదశి వ్రత పారన.. మనం ఏం చేయాలంటే?