Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుంచి ఆర్జే సూర్య అవుట్.. హమ్మయ్య అనుకుంటున్న నెటిజన్స్?
తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే ఏడువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని
- By Nakshatra Published Date - 06:45 PM, Sat - 29 October 22
తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 చూస్తుండగానే ఏడువారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ఎనిమిదవ వారం ముగింపు దశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఏడు వారాలకు గాను ఏడుగురు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. కాగా 21 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన ఈ షోలో ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎనిమిదో వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అయితే బాస్ బ్ బాస్ సీజన్ 6 లో గడచిన మూడు వారాలు అనగా ఐదవ వారం ఆరో వారం ఏడవ వారం ఈ మూడు వారాలు కూడా ఎలిమినేషన్స్ బిగ్ బాస్ ప్రేక్షకులు ముందుగానే ఊహించినట్టుగా జరిగాయి.
8వ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించిన సమయం దగ్గర పడుతుండడంతో సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఎనిమిదవ వారం ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్య ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఫెమినిస్ట్ అయినా ఆర్జె సూర్య హౌస్ లో ఆరోహి రావుతో చనువుగా ఉంటూ ఆమె వెళ్లిపోయాక ఇనయా తో చేసే రొమాన్స్ చేశాడు. ఆ తర్వాత ఇనయా తో సూర్య ప్రవర్తించిన తీరు ప్రేక్షకులకు నచ్చలేదు. సూర్యకు బుజ్జమ్మ ఉందని తెలిసి, తప్పేమో అని చాలా ఆగుతున్నట్లు కూడా తెలిపింది.
అయితే బుజ్జమ్మకు సూర్యకు ఎలాంటి రిలేషన్ షిప్ ఉన్నా ఇనయా, ఆరోహితో సూర్య ప్రవర్తించిన తీరు తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. ఏదో ఓదారుస్తున్నట్లు, ఏడుస్తున్నట్లు చేస్తూ కావాలనే హగ్ చేసుకోవడం వంటివి చేసినట్లు ప్రేక్షకులు భావించినట్లు తెలుస్తోంది. దీంతో హౌస్ నుంచి ఊహించిన విధంగా సూర్య ఎలిమినేట్ అయినట్టుగా జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ విషయంపై పలువురు నెటిజన్స్, బిగ్ బాస్ ప్రేమికులు స్పందిస్తూ హమ్మయ్య వెళ్ళిపోతున్నాడా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు అయితే ఇకపై అతని అరాచకాలు బిగ్ బాస్ హౌస్ లో చూడవలసిన అవసరం ఉండదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి