Bigg Boss 6: బిగ్ పనిష్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఉన్నట్టుండి కింద పడిపోయిన రేవంత్?
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షోలో తాజాగా ఏడవ వారంలో ఒక టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల
- By Nakshatra Published Date - 06:40 PM, Wed - 19 October 22
తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 షోలో తాజాగా ఏడవ వారంలో ఒక టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ల అందరిపై మండిపడిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్ సరిగా ఆడక పోవడంతో అందరినీ గార్డెన్ ఏరియాలో పిలిపించి మరి ఫైర్ అవడంతో పాటు ఇష్టం లేనివారిని వెళ్లిపోవచ్చు అంటూ గేటు వాకిలి కూడా తీసేసారు. బిగ్బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నిరాశ పరుస్తున్న కారణంగా ఆ కెప్టెన్సీ రద్దు చేశాడు బిగ్ బాస్. దీంతో కంటెస్టెంట్లు అందరూ ఒక్కొక్కరిగా బిగ్ బాస్ ఈ క్షమాపణలు చెప్పడం మొదలు పెట్టేశారు.
బిగ్ బాస్ షో పట్ల గౌరవం లేని వారు తక్షణమే ముఖద్వారం నుంచి వెళ్ళిపోవచ్చు అని చెబుతూ అనంతరం వాళ్ళ కాస్ట్యూమ్స్ ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టేయాలి అని ఆదేశించాడు బిగ్ బాస్. అయితే కెప్టెన్సీ టాస్క్ ను రద్దు చేయడంతో ఆ షాక్ లో ఉన్న కంటెస్టెంట్స్ కు తాజాగా బిగ్ బాస్ మరొక షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా హౌస్ లోని సభ్యులకు ఒక టాస్క్ ని ఇచ్చాడు బిగ్ బాస్. ఇంట్లో ఉన్న ఆహారం మొత్తం తీసుకెళ్లి పోయే టాస్క్ ని ఇచ్చాడు. జింతో హౌస్ మేట్స్ ఎక్కడపడితే అక్కడ పడుకొని బిగ్ బాస్ తో ఆకలేస్తోంది అని చెప్పడం ప్రోమోలో చూడవచ్చు. రేవంత్ అయితే పాటలు పాడాడు.
సూర్య స్పూన్ కి ఉన్న చక్కెర తిన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి బిగ్ బాస్ గార్డెన్లో ఫుడ్ ని పెట్టి పోరాడి సంపాదించుకోవాలి ఆదేశించాడు. ఇంటి సభ్యులు రెండు బృందాలుగా విడిపోయి వారి మధ్య కబడ్డీ పోటీ పెట్టారు. అందరూ పోటాపోటీగా గేమ్ ఆడారు. గేమ్ ఆడుతుండగా రేవంత్ చివర్లో కాలు స్లిప్ అయ్యి పై పడిపోయాడు. రేవంత్ గారికి తీవ్రమైన నొప్పి రావడంతో పడిపోయినట్లు తెలుస్తోంది. గతంలో అయిన గాయంకే మళ్లీ తగలడంతో ఆ గాయం ఎక్కువైనట్లు తెలుస్తోంది.
Related News
London Stabbings: పోలీసులే లక్ష్యంగా లండన్ లో వ్యక్తి కత్తులతో వీరంగం
లండన్ లో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. నార్త్-ఈస్ట్ లండన్లో వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. ప్రజలపై మరియు పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.