Bigg Boss 6: ఒక్క టాస్క్ తో బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఓటింగ్.. టాప్ లో బాలాదిత్య?
తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లో జరిగిన టాస్క్ లో భాగంగా గీతూ నీచంగా ప్రవర్తించడంతోపాటు ఎప్పుడూ సైలెంట్ గా ఉండే
- By Nakshatra Published Date - 03:05 PM, Wed - 2 November 22
తాజాగా బిగ్ బాస్ సీజన్ 6 లో జరిగిన టాస్క్ లో భాగంగా గీతూ నీచంగా ప్రవర్తించడంతోపాటు ఎప్పుడూ సైలెంట్ గా ఉండే రేలంగి మామయ్య బాలాదిత్యను ఒక్కసారిగా గుక్క పట్టి ఏడ్చేలా చేసింది. బాలాదిత్య వీక్నెస్ పై దెబ్బకొడుతూ అతన్ని ఏడిపించేసింది. దీంతో తాజాగా జరిగిన ఈ టాస్క్ తో ఒక్కసారిగా షాకింగ్ ఓటింగ్ నమోదు అయ్యింది. తాజాగా మంగళవారం హౌస్ లో జరిగిన టాస్క్ తో ఒకసారిగా ఓటింగ్ మారిపోయింది. ఈ ఓటింగ్ తో టాప్ లోకి తీసుకువచ్చాడు బాలాదిత్య. ఈ నేపథ్యంలోనే బాలాదిత్య టాప్ వన్ లో ఉండగా రెండో స్థానంలో రేవంత్ ఉన్నాడు.
ఇనయ సుల్తానా మూడవ స్థానంలో ఉంది. ఇక ఆ తర్వాత ప్లేసుల్లో కీర్తి 4వ స్థానంలో,ఆదిరెడ్డి ఐదవ స్థానంలో, రోహిత్ ఆరవ స్థానంలో, మెరీనా ఏడవ స్థానంలో, ఫైమా ఎనిమిది, శ్రీ సత్య 9, చివరి పదవ స్థానంలో గలాటా గీతూ ఉంది. టాస్క్ ఆడుతున్న సమయంలో బాలాదిత్య వీక్నెస్ పై దెబ్బ కొట్టడం ఎవరికీ నచ్చలేదు. అయితే సిగరెట్లు లేకపోతే బాలాదిత్య ఒత్తిడికి లోనవుతాడు అన్న విషయం తెలిసి కూడా అతన్ని ఏడిపించేసింది.
బాలాదిత్య పట్ల ఆమె అలా ప్రవర్తించడంతో ఆమెపై ఒక్కసారిగా నెగిటివిటీ ఎక్కువ అయింది. అయితే బిగ్ బాస్ మొదటి నుంచి గీతూని కాపాడుతూ వస్తున్నాడు అని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజా గారి టాస్క్ లో భాగంగా గీత చేసిన పనికి తప్పకుండా ఆమెను ఎలిమినేట్ చేయాలి అని నెటిజెన్స్ గట్టిగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక తొమ్మిదవ వారం ఎలా అయినా గీతుకి చరమగీతం పాడాలి అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి