Bigg Boss Season 8 : బిగ్ బాస్ సీజన్ 8.. ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎవరంటే..?
Bigg Boss Season 8 ఈ వారం తేజాని ఎలిమినేట్ చేశారు. ఐతే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పిన నాగార్జున ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. సో తేజాతో పాటు ఈ వారమే మరో
- By Ramesh Published Date - 11:40 PM, Sat - 30 November 24

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Season 8) లో ఈ వారం మొత్తం జరిగిన టికెట్ టు ఫినాలె టాస్క్ లో భాగంగా అవినాష్ టికెట్ టు ఫినాలె గెలిచాడు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అవినాష్ అది సేవ్ అయితేనే అతను ఫైనలిస్ట్ అవుతాడు. ఐతే శనివారం ఎపిసోడ్ మొదలు పెట్టడమే ఆలస్యం అవినాష్ (Avinash) ని సేవ్ చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు హోస్ట్ నాగార్జున. సో టాప్ 5 లో ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ గా అవినాష్ చేరుకున్నాడు.
ఇక టాప్ 5కి వెళ్లాల్సిన మరో నలుగురు ఎవరన్నది తెలియాల్సి ఉంది. రాబోయే రెండు వారాల్లో ఎవైతే ఆడియన్స్ మనసులు గెలుస్తారో వారే టాప్ 5 లో ఛాన్స్ అందుకుంటారు. శనివారం ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న తేజాని ఎలిమినేట్ చేశాడు నాగార్జున (Nagarjuna). ప్రతి వారం అందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చి ఒకరిని ఎలిమినేట్ చేస్తారు.
కానీ ఈ వారం తేజాని ఎలిమినేట్ చేశారు. ఐతే ఈ వారం డబల్ ఎలిమినేషన్ అని ముందే చెప్పిన నాగార్జున ఆదివారం మరో ఎలిమినేషన్ ఉంటుందని హింట్ ఇచ్చాడు. సో తేజాతో పాటు ఈ వారమే మరో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బిగ్ బాస్ లీక్స్ ప్రకారం పృధ్వి సెకండ్ ఎలిమినేటర్ గా ఆదివారం హౌస్ నుంచి వెళ్తాడని తెలుస్తుంది.
సో పృధ్వి వెళ్లడంతో టాప్ 5 లో ఎవరెవరు వెళ్తారన్నది ఆసక్తి కరంగా మారింది. మరి ఆ ఛాన్స్ ఆడియన్స్ ఎవరికి ఇస్తారన్నది చూడాలి.