Bigg Boss: బిగ్ బాస్ షో కోసం రతిక రోజ్ ఎన్ని లక్షలు తీసుకుందో తెలుసా!
ఈ బ్యూటీ షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుందట.
- By Balu J Published Date - 01:09 PM, Mon - 2 October 23

BiggBoss7 తెలుగు రియాలిటీ షోలో ప్రవేశించిన చాలా మంది కంటెస్టెంట్లకు ప్రేక్షకులలో అంతగా ఆదరణ పొందలేదు. అయితే ఓ బ్యూటీ తన చేష్టలు, మాటలతో యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె మరెవరో కాదు హైదరాబాద్‌కు చెందిన రతికా రోజ్. ఈ బ్యూటీ షో నుంచి ఎలిమినేట్ అయినప్పటికీ బాగానే రెమ్యూనరేషన్ తీసుకుందట.
ఆమె రోజుకు రూ. 28 వేలు తీసుకుందట. అంటే దాదాపు వారానికి రూ. 2 లక్షలు. నాలుగు వారాలున్న రతికా రోజ్ రూ. 8 లక్షల వరకు తీసుకున్నారని అంటున్నారు. రతికా రోజ్ కి బయట అంత ఫేమ్ లేదు. యూట్యూబ్ ప్రేక్షకులకు మాత్రమే ఆమె తెలుసు. అయినా పెద్ద మొత్తంలో తీసుకొని అందర్నీ ఆకట్టుకుంది. #BiggBoss7 హౌస్‌లోకి రాకముందు రతిక రోజ్ గురించి చాలా మందికి తెలియదు.
కానీ వాస్తవానికి, షకలక శంకర్‌తో కలిసి 2020 చిత్రం “బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది”తో టాలీవుడ్‌లో ప్రధాన నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఆ సమయంలో ఆమె ప్రియ అనే పేరుతో పిలవబడింది. అంతేకాదు.. స్టాండప్ కామెడీలో కి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ETV స్టాండప్ కామెడీ షో పటాస్‌లో కూడా కనిపించింది. ఈమె రీసెంట్‌గా ‘నేను స్టూడెంట్ సర్’ సినిమాలో కూడా కనిపించింది. అయితే ఈ ఈ సినిమాలన్నీ హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీ వెలుగులోకి రాలేదు. ఈ బిగ్ బాస్ తోనైనా అవకాశాలు వస్తాయేమో చూడాల్సిందే.
Also Read: Pawan Kalyan: మహాత్మా గాంధీజీ బాట సర్వదా అనుసరణీయం: పవన్ కళ్యాణ్