Bigg Boss Arjun : బిగ్ బాస్ అర్జున్ కి మెగా ఛాన్స్.. ఉప్పెన డైరెక్టర్ ఓపెన్ గా చెప్పేశాడు..!
Bigg Boss Arjun బిగ్ బాస్ సీజన్ 7 లో ఉన్న ఒక కంటెస్టెంట్ కి మెగా ఛాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో రాబోతున్న
- By Ramesh Published Date - 01:40 PM, Tue - 14 November 23

Bigg Boss Arjun బిగ్ బాస్ సీజన్ 7 లో ఉన్న ఒక కంటెస్టెంట్ కి మెగా ఛాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమాలో బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss) కంటెస్టెంట్ అర్జున్ లక్కీ ఛాన్స్ అందుకున్నాడు. ఈ విషయాన్ని దీపావళి సందర్భంగా డైరెక్టర్ బుచ్చి బాబు స్వయంగా చెప్పారు. దీపావళి సందర్భంగా హౌస్ మెట్స్ అందరి ఫ్యామిలీ మెంబర్స్ తో పాటుగా ఫ్రెండ్స్ ని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు నాగార్జున.
అర్జున్ కోసం డైరెక్టర్ బుచ్చి బాబు అతని ఫిట్ నెస్ కోచ్ విజయ్ వచ్చారు. ఇద్దరు అర్జున్ ఎంత కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చాడో చెప్పారు. ఈ క్రమంలో బుచ్చి బాబు అర్జున్ నువ్వు రాం చరణ్ సినిమాలో మంచి పాత్ర చేస్తున్నావ్ అని ఆఫర్ ఇచ్చారు. అంతకుముందే అర్జున్ కి బుచ్చి బాబుతో పరిచయం ఉంది. అర్జున్ బుచ్చి బాబు ఆఫీస్ కి కూడా వెళ్లాడట.
మొత్తానికి ఆర్సీ 16వ సినిమాలో అర్జున్ ఛాన్స్ అందుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ తో గ్లోబల్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న రాం చరణ్ తన ప్రతి సినిమాను నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో దూసుకెళ్తున్నాడు. బుచ్చి బాబు (Bucchi Babu) ఈ సినిమాను కూడా పీరియాడికల్ సినిమాగా చేస్తున్నారు. ప్రస్తుతం శంకర్ గేం చేంజర్ సినిమా చేస్తున్న రాం చరణ్ ఈ సినిమాతో కూడా తన సత్తా చాటనున్నాడు.
Also Read : Vaishnavi Chaitanya : బేబీ వైష్ణవి బ్లాస్టింగ్ రెమ్యునరేషన్..!
We’re now on WhatsApp : Click to Join