Bigg Boss 8 : బిగ్ బాస్ 8లో ఈ వారం ఆ కంటెస్టెంట్ కి బై బై..!
Bigg Boss 8 ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి శనివారం సాయంత్రం కల్లా బిగ్ బాస్ లీక్స్ ద్వారా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది క్లారిటీ వస్తుంది.
- By Ramesh Published Date - 11:22 PM, Fri - 25 October 24

బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss 8,) లో ప్రతి వారం లానే ఈ వారం కూడా నామినేషన్స్ జరిగాయి. మండే నామినేషన్స్ లో హౌస్ లో ఉండటానికి అర్హత లేని వారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ వారం నామినేషన్స్ లో ఆరుగురు హౌస్ మెట్స్ ఉన్నారు. వారిలో పృధ్వి, మెహబూబ్, విష్ణు ప్రియ, నయని పావని, ప్రేరణ, నిఖిల్ ఉన్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అంతా కూడా నామినేషన్స్ లో ఉండటం తో ఓటింగ్ చాలా ప్రాధాన్యంగా మారింది.
ఐతే నామినేషన్స్ లో ఉన్న వారిని ఈ వీక్ మొత్తం వారి ఆట చూసి ఆడియన్స్ వారు ఇంట్లో ఉండాలా లేదా బయటకు వెళ్లాలా అని డిసైడ్ చేస్తారు. ఈ వారం ఓటింగ్ అనాలసిస్ లను బట్టి చూస్తే నయని పావనికి లీస్ట్ ఓటింగ్ ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు ఆమే ఈ వారం హౌస్ ను వదిలి వెళ్తుందని చెప్పుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో నయని పావని..
ఆదివారం ఎపిసోడ్ శనివారమే షూట్ చేస్తారు కాబట్టి శనివారం సాయంత్రం కల్లా బిగ్ బాస్ లీక్స్ (Bigg Boss Leak) ద్వారా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది క్లారిటీ వస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో నయని పావని (Nayani Pavani) వైల్డ్ కార్డ్ గా వచ్చింది. సీజన్ 7 లో కూడా నయని పావని వైల్డ్ కార్డ్ వా వచ్చి వారానికే ఎలిమినేట్ అయ్యింది. ఐతే ఈసారి కూడా దాదాపు ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. నయని కాకపోతే విష్ణు ప్రియ, పృధ్విలు లీస్ట్ ఓటింగ్ లో ఉన్నారు.
ఐతే ఈ వారం మెగా చీఫ్ టాస్క్ పూర్తి కాగా శుక్రవారం రోజు ఎపిసోడ్ తో ఈ వారం మెగా చీఫ్ గా విష్ణు ప్రియ ఎంపికైంది. సో ఆమె దాదాపు సేఫ్ అవుతున్నట్టే లెక్క.
Also Read : Kiran Abbaram Ka : కిరణ్ అబ్బవరం లెక్క సరిచేసేలా ఉన్నాడే..!