Bigg Boss 8 : బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమో అదిరింది.. నాని, రానా.. ఇంకా బోలెడంతమంది గెస్టులు..
తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
- By News Desk Published Date - 12:43 PM, Sun - 1 September 24

Bigg Boss 8 Telugu : తెలుగులో బిగ్ బాస్ సీజన్ 8 నేటి నుంచే మొదలు కానుంది. నేడు సెప్టెంబర్ 1 సాయంత్రం 7 గంటల నుండి మా టీవీలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొదలవ్వనుంది. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఈ షో కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోలోకి కంటెస్టెంట్స్ ఎవరెవరు వెళ్తున్నారా అని ఎదురుచూస్తున్నారు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 8 ఓపెనింగ్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేసారు.
ఈ ప్రోమోలో కంటెస్టెంట్స్ ఫేసెస్ చూపించకుండా జంటలు జంటలుగా లోపలికి వెళ్లినట్టు చూపించారు. ఈసారి మరింత కలర్ ఫుల్ గా, మరింత ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్టు నాగార్జున చెప్పారు. ఓపెనింగ్ ఎపిసోడ్ కి సరిపోదా శనివారం టీమ్ నాని, ప్రియాంక మోహన్ వచ్చి కాసేపు సందడి చేసారు. నాని ని మరోసారి హోస్ట్ చేయమని సరదాగా నాగార్జున అడగడంతో అదొక్కటి తప్ప ఇంకేదైనా చేస్తాను అని అన్నారు.
అలాగే 35 – చిన్న కథ కాదు సినిమా టీమ్ తరపున రానా, నివేదా థామస్, విశ్వదేవ్ వచ్చి సందడి చేసారు. అలాగే చివర్లో అనిల్ రావిపూడి వచ్చి హౌస్ లోపలికి వెళ్లి కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చారు. మరి ఆ షాక్ ఏంటి, ఎవరెవరు కంటెస్టెంట్స్ లోపలి వెళ్లారు, ఇంకెవరు గెస్టులుగా వచ్చారు, ఏ హీరోయిన్స్ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇచ్చారు తెలియాలంటే ఇవాళ రాత్రికి బిగ్ బాస్ ఓపెనింగ్ ఎపిసోడ్ చూసేయాల్సిందే. ప్రోమో మీరు కూడా చూసేయండి..
Also Read : Surya : రజిని కోసం వెనక్కి తగ్గిన సూర్య..!