Bigg Boss 7 : టేస్టీ తేజ ఎలిమినేషన్.. ఆ ఒక్కటి జరిగి ఉంటే..!
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాలుగా అతని చలాకీతనం, ఎంటర్టైన్మెంట్ తో హౌస్ మెట్స్ ని అలరించిన తేజ ఫైనల్
- By Ramesh Published Date - 02:10 PM, Mon - 6 November 23

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 నుంచి ఆదివారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాలుగా అతని చలాకీతనం, ఎంటర్టైన్మెంట్ తో హౌస్ మెట్స్ ని అలరించిన తేజ ఫైనల్ గా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అయితే ఈ ఎలిమినేషన్ పై తేజకు ఓట్ వేసిన కొందరు అసంతృప్తిగా ఉన్నారు. ఈ వారం శోభా శెట్టి ఇంటికి వెళ్తుందని భావించగా ఆమెను సేవ్ చేసి తేజని బయటకు పంపించారు. అయితే తేజ హౌస్ లో ఉన్నప్పుడు తన మదర్ హౌస్ కి వస్తే చూడాలని అనుకున్నాడు. కానీ అది జరగకుండానే ఎలిమినేట్ అయ్యాడు.
హోస్ట్ నాగార్జున (Nagarjuna) కూడా తేజ జర్నీ అంతా బాగుంది కానీ అమ్మని హౌస్ లోకి తీసుకు రాలేదన్న ఒక్క వెలితి మాత్రమే ఉందని దానికి తను కూడా ఫీల్ అవుతున్నానని అన్నారు. తేజ (Teja) ఎలిమినేషన్ వల్ల హౌస్ లో కూడా అందరు కాస్త డల్ గా కనిపించారు. ఎలిమినేట్ అయ్యాక తేజ నాలుగైదు వారాలు ఉంటానని అనుకుంటే 9 వారాలు ఉన్నా అది చాలని అన్నాడు.
Also Read : Black Heads : ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్ ను ఇలా తొలగించుకోండి..
నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ అని తెలుస్తుంది. తేజ ఈ ఒక్క వారం హౌస్ లో ఉంటే బాగుండేదని ఆడియన్స్ అనుకున్నారు. తేజ ఎలిమినేట్ అవడం వల్ల శోభా శెట్టి (Shobha Shetty)కి కాస్త బోర్ కొడుతుందని చెప్పొచ్చు. ఇక మీదట నామినేషన్స్ కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యారు హౌస్ మెట్స్. ఈ వీక్ ఎవరెవరు నామినేషన్స్ లో ఉంటారు అన్నది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.
ఇక మీదత సిల్లీ రీజన్స్ తో నామినేషన్స్ చేయడం అనేది జరగదని చెప్పొచ్చు. నామినేషన్స్ అంటే అది సరదాగా వేసే ప్రక్రియ కాదని బిగ్ బాస్ చాలాసార్లు చెప్పాడు. ఈ వారం అయినా హౌస్ మెట్స్ లో ఆ సీరియస్ నెస్ కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join