Bigg Boss 7 : ఆ బిగ్ బాస్ కంటెస్టెంట్ కి ఆల్రెడీ పెళ్లైందా.. మరి ఎందుకు దాచేస్తుంది..?
Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో మొదట వచ్చిన 14 మంది కాకుండా రీ ఎంట్రీ టైం లో మరో ఐదుగురు వచ్చారు. వారిలో స్టార్ మా సీరియల్ యాక్టర్ అర్జున్
- By Ramesh Published Date - 09:20 AM, Sun - 12 November 23

Bigg Boss 7 బిగ్ బాస్ సీజన్ 7 లో మొదట వచ్చిన 14 మంది కాకుండా రీ ఎంట్రీ టైంలో మరో ఐదుగురు వచ్చారు. వారిలో స్టార్ మా సీరియల్ యాక్టర్ అర్జున్ తో పాటుగా బోలే శావలి, పూజా, నయని పావని, అశ్విని శ్రీ వచ్చారు. వారిలో అర్జున్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఉండగా పూజా, నయని పావని ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం బోలే శావలి కూడా ఎలిమినేట్ అవుతున్నాడు. ఇక హౌస్ లో ఆటతో పాటు గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకుంటుంది అశ్విని.
టాలీవుడ్ లో చిన్నా చితకా పాత్రలు వేస్తూ కెరీర్ సాగిస్తున్న అమ్మడికి బిగ్ బాస్ అనేది మంచి అవకాశం గా భావిస్తుంది. అయితే హౌస్ మెట్స్ కి తన పాయింట్ వినిపించడంలో ట్రాక్ తప్పుతుంది. ఇదిలాఉంటే హౌస్ లో అశ్విని గ్లామర్ షోకి ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అందుకే ఆమె ఇంకా హౌస్ లో ఉందని చెప్పుకోవచ్చు.
Also Read : Raviteja : రవితేజ లెనిన్.. మాస్ రాజా ప్లానింగ్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్..!
ఇదిలాఉంటే అశ్విని కి ఆల్రెడీ పెళ్లైందని.. కాకపోతే భర్త నుంచి దూరమైందని టాక్. ఈ వార్తల్లో నిజం ఎంతో కానీ 2013 లోనే అశ్విని మ్యారేజ్ జరిగిందని. తర్వాత కొన్నాళ్లకే భర్త నుంచి దూరమైందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజం ఉందా అశ్వినికి నిజంగానే పెళ్లైందా అన్నది తెలియాల్సి ఉంది.
అశ్విని ఈ వారం కాకపోయినా మరో రెండు 3 వారల్లో అయినా హౌస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. కచ్చితంగా ఆమె టాప్ 5 లో ఉండే అవకాశం అయితే లేదు.
We’re now on WhatsApp : Click to Join