Raviteja : రవితేజ లెనిన్.. మాస్ రాజా ప్లానింగ్ తో ఫ్యాన్స్ ఫుల్ జోష్..!
మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) మరో సినిమాను లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన నటించిన ఈగల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తుండగా
- By Ramesh Published Date - 09:04 AM, Sun - 12 November 23

మాస్ మహరాజ్ రవితేజ (Raviteja) మరో సినిమాను లైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆయన నటించిన ఈగల్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తుండగా ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో మరో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు రవితేజ. ఇక ఈ సినిమా తర్వాత అనిల్ రావిపుడితో రవితేజ సినిమా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. రీసెంట్ గా భగవంత్ కేసరితో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపుడి రాజా ది గ్రేట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత వినరో భాగ్యము విష్ణు కథ సినిమా డైరెక్టర్ మురళి కిషోర్ తో రవితేజ సినిమా ఉంటుందని అంటున్నారు. రవితేజ కు మురళి కిషోర్ ఒక పీరియాడికల్ కథ చెప్పారట. రంగస్థలం సినిమా నుంచి పీరియాడికల్ కథలను చాలా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో స్టార్స్ కూడా అందుకు రెడీ అనేస్తున్నారు.
Also Read : Allu Arjun : జాతర ఎపిసోడ్ హైలెట్.. పుష్ప 2 పై అంచనాలు పెంచేస్తున్న అల్లు అర్జున్..!
రవితేజ కోసం మురళి కిషోర్ ఒక అద్భుతమైన కథ రాసుకున్నారట. ఆ సినిమాకు టైటిల్ గా లెనిన్ అని పెట్టినట్టు తెలుస్తుంది. కాంబో ఇంకా ఫిక్స్ అవలేదు కానీ ఇప్పటికే టైటిల్ కూడా ఫైనల్ చేశారు. లెనిన్ టైటిల్ రవితేజకు పర్ఫెక్ట్ సూట్ అవుతుంది.
హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా రవితేజ తన పంథాలో సినిమాలు తీస్తూ వెళ్తున్నారు. ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్ అందుకున్న మాస్ రాజా రావణాసుర, టైగర్ నాగేశ్వర రావుతో ఫ్లాప్ అందుకున్నాడు. రాబోతున్న సినిమాలు రవితేజ మాస్ స్టామినా బాక్సాఫీస్ దగ్గర చూపిస్తాయో లేదో అన్నది చూడాలి.
We’re now on WhatsApp : Click to Join