Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఆమేనా? సోషల్ మీడియాలో ప్రచారం?
Bigg Boss 6 telugu: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికి రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకునే మూడో వారంలోకి అడుగు పెట్టింది.
- By Nakshatra Published Date - 03:58 PM, Sat - 24 September 22
Bigg Boss 6 telugu: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పటికి రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకునే మూడో వారంలోకి అడుగు పెట్టింది. కాగా అప్పుడే మూడవ వారం ఎలిమినేషన్ కూడా దగ్గర పడింది. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా మూడవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో తాజాగా మూడవ వారం ఎలిమినేషన్ కి సంబంధించిన లీక్ ఒకటి బయటకు వచ్చింది. అయితే బిగ్ బాస్ షో విషయంలో ఎప్పుడు కూడా ప్రేక్షకుల అంచనాలు తప్పుతూనే ఉంటాయి.
ఎవరైతే ఆటను బాగా ఆడుతూ ఉంటారో వారిని పంపించడం అన్నది తొలి సీజన్ నుంచి జరుగుతూనే ఉన్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ సిక్స్ మూడవ వారంలో కూడా ఇదే రిపీట్ కానుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఒంటరి పోరాట చేస్తున్న ఇనయ సుల్తానా ఈవారం ఎలిమినేట్ అయినట్లు తాజా సమాచారం. తొలివారం ఆడియన్స్‌తో ఓట్లు వేయించుకుని ఎలిమినేషన్ ఎత్తేశారు. ఆ తరువాతి వారంలో సెటిల్డ్ గేమ్ ఆడుతున్న షానీ, అభినయ శ్రీలను ఒకేసారి ఎలిమినేట్ చేసి బయటకు. మూడవ వారం నామినేషన్స్‌లో పదిమంది ఉన్నారు.
సుదీప,ఆరోహి,ఇనయ సుల్తానా, వాసంతి, నేహా, గీతు,చలాకీ చంటి,శ్రీహాన్, రేవంత్ బాలాదిత్య ఈ పది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఈసారి కూడా అత్యధిక ఓటింగ్ రేవంత్ కి వచ్చింది. కాగా శనివారం నుంచి ఆరోహి, ఇనయ, నేహా, వాసంతి ఈ నలుగురు ఓటింగ్‌లో నుంచి వెనుకబడ్డారు. కానీ ఎప్పుడైతే కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయ్యిందో ఇనయ బాగానే ఆడింది. దొంగల టాస్క్‌లో అయితే ఒళ్లు హూనం చేసుకుంది. టాస్క్ లలో ఇనయ మాత్రం ఒంటరిపోరాటం చేసింది. తాజాగా శ్రీహాన్ ఇనయ సుల్తానా పిట్ట అంటూ హేళన చేసే మాట్లాడడంతో ఆమె కూడా ఏ మాత్రం తగ్గకుండా మగాడి వేనా అంటూ మాట్లాడేసింది. మొత్తంగా మూడవ వారంలో ఎక్కువ హైలైట్ అయ్యింది ఇనయనే. అమ్మాయిల్లో గట్టి పోటీ ఇచ్చి అందరికంటే బాగా ఆడింది కూడా ఆమెనే. కానీ ఊహించిన విధంగా మూడవ వారం వినయ ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Related News
Kumari Aunty : బిగ్ బాస్ హౌస్ కి కుమారి ఆంటీ.. కామన్ మ్యాన్ కేటగిరిలో ఆమెను తీసుకుంటారా..?
Kumari Aunty సోషల్ మీడియాలో కాస్త పాపులర్ అయితే చాలు వారి ఫస్ట్ గోల్ బిగ్ బాస్ కి వెళ్లడమే. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ ని సెలబ్రిటీ తో పాటుగా ఒక కామన్ మ్యాన్ కేటగిరి