Bigg Boss 6: ఆదిరెడ్డిపై గీతూ కామెంట్స్.. ఎలిమినేట్ అంటూ ఒక్కసారిగా షాకిచ్చిందిగా!
బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం సెలబ్రిటీ గేమింగ్ లీగ్ టాస్క్ ని బిగ్ బాస్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో
- By Nakshatra Published Date - 02:39 PM, Thu - 20 October 22
బిగ్ బాస్ సీజన్ 6 ఏడవ వారం సెలబ్రిటీ గేమింగ్ లీగ్ టాస్క్ ని బిగ్ బాస్ రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టాస్క్ లో కంటెస్టెంట్లు ఫన్నీగా ప్రవర్తిస్తూ ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు చేయడంతో వెంటనే ఆగ్రహించిన బిగ్ బాస్ టాస్క్ ని రద్దు చేస్తూ కంటెస్టెంట్లపై నిప్పులు చెలరేగాడు. అయితే కంటెస్టెంట్లు చేసిన పనికి బిగ్ బాస్ ఇంకా కోపంతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కంటెస్టెంట్ లకు బిగ్ బాస్ఏది చెప్పాలి అనుకున్న అన్ని లెటర్ల ద్వారానే వారికి తెలిసేలా చేస్తున్నాడు.
కెప్టెన్సీ టాస్క్ రద్దవ్వడంతో కెప్టెన్ గా తాను ను ఫెయిల్ అయ్యాను అంటూ కెమెరాల ముందుకు వచ్చి ఏడ్చేసాడు సూర్య. మరోపక్క ఆదిరెడ్డి రివ్యూలు ఇస్తూనే ఉన్నాడు. ఈ సీజన్‌కు వచ్చినవాళ్లలో ఎక్కువమంది తుప్పాస్ కంటెస్టెంట్స్ అని గీతూతో చెప్పుకొచ్చాడు. అప్పుడు గీతూ ఆది కి షాక్ ఇస్తూ నువ్వు కూడా నిన్నటి టాస్క్‌లో సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. బిగ్‌బాస్‌ను కాదు నన్ను నిరాశ పరిచావు అంటూ పెద్ద క్లాస్ పీకింది. ఇలాగైతే ఫేమ్ ఉన్నవాళ్లు ఉండి లేనివాళ్లు వెళ్లిపోతారు అని తెలిపింది గీతూ.
నువ్వు కూడా ఎక్కడ పోతావోనని నాకు భయమేస్తోంది ఆది రెడ్డి. నువ్వు కూడా ఎలిమినేట్ అయ్యేవాళ్ల లిస్ట్‌లో ఉండవచ్చు అనే గీతూ అనడంతో ఆదిరెడ్డి ఆశ్చర్యపోతాడు. అలాగే నువ్వు కానీ నా వల్ల సేఫ్ అవుతావు. అది పక్కన పెట్టేస్తే నీ వల్ల ఎంటర్టైన్ చేసేవాళ్లు వెళ్లిపోయినా బాధపడతాను అని గీతూ అనడంతో ఆ మాటలకు ఆదిరెడ్డి ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర ఎంటర్టైన్మెంట్ జీరో అంటూ అతడిని తక్కువ చేసి మాట్లాడింది. మొత్తానికి గీతం మాటలను బట్టి చూస్తే ఆదిరెడ్డి బయటికి వెళ్లాలని ఆమె కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పక్కనే ఉన్న బాలాదిత్య ని కూడా నువ్వు ఒక మోస్ట్ ఇన్ మెచ్యూర్ పర్సన్ వి అనడంతో బాలాదిత్యా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు.
Related News
Pallavi Prashanth: రైతు బిడ్డ ముసుగులో అలాంటి పనులు చేస్తున్న పల్లవి ప్రశాంత్.. బయటపడ్డ మోసం?
తెలుగు బిగ్ బాస్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ గురించి మనందరికి తెలిసిందే. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్ పేరు వినిపిస్తూనే ఉంది. పల్లవి ప్రశాంత్ కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియా వైరల్ అవుతూనే ఉన్నాయి. తరచూ ఏదో ఒక విషయంతో పల్లవి ప్రశాంత్ పేరు సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రశాంత్ హౌస్ లో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు బయటకు వచ్చి