Amitabh Bachchan : స్విగ్గి షేర్లు కొన్న కల్కి స్టార్..!
సినిమాలో అశ్వథ్ధామ పాత్రలో మెప్పించిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని తెలుస్తుంది. బాలీవుడ్ లో స్టార్ గా ఎంతో గొప్ప క్రేజ్ తెచ్చుకున్న
- By Ramesh Published Date - 10:37 PM, Thu - 29 August 24

Amitabh Bachchan కల్కి స్టార్ స్విగ్గి స్టేక్స్ ఉన్నాడని తెలియగానే అందరు మన రెబల్ స్టార్ ప్రభాస్ స్విగ్గికి సపోర్ట్ చేస్తున్నాడేమో.. అతనే స్విగ్గి షేర్లు కొన్నాడేమో అనుకుంటారు. కానీ స్విగ్గి షేర్లు కొన్న కల్కి స్టార్ ప్రభాస్ కాదు ఆ సినిమాలో అశ్వథ్ధామ పాత్రలో మెప్పించిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని తెలుస్తుంది. బాలీవుడ్ లో స్టార్ గా ఎంతో గొప్ప క్రేజ్ తెచ్చుకున్న అమితాబ్ ఈమధ్య ఎక్కువ సినిమాలు చేయకపోయినా సరే చేసిన కొద్ది సినిమాల్లో అయినా మంచి పాత్రలు చేయాలని అనుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే ప్రభాస్ కల్కి లో అశ్వథ్ధామ పాత్రలో అదరగొట్టారు. ఓ విధంగా ప్రభాస్ ఫ్యాన్స్ కే కాదు అమితాబ్ వింటేజ్ ఫ్యాన్స్ కి కల్కి ఐ ఫీస్ట్ అందించిందని చెప్పొచ్చు. ఐతే తన రెమ్యునరేషన్ ఇంకా బిజినెస్ విషయాల్లో అమితాబ్ చాలా క్లవర్ గా ఉంటారు. ఈ క్రమంలోనే అమితాబ్ ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి షేర్ల మీద కొంత ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ గా స్విగ్గి టాప్ ప్లేస్ లో ఉంది. జోమాటో కి ఏమాత్రం తగ్గకుండా ఇది పోటీ ఇస్తుంది. ఐతే స్విగ్గి (Swiggy) స్టేక్స్ ను అమితాబ్ కొన్నట్టు తెలుస్తుంది. స్విగ్గికి సంబందించిన కొన్ని షేర్లు అమితాబ్ తీసుకున్నారట. ఈ విషయం స్వ్యంగా అమితాబ్ చెప్పకపోయినా ఎలాగోలా బయటకు వచ్చింది.
మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్విగ్గి ఆన్ లైన్ ఫుడ్ డెలివెరీ మంచి మార్కెట్ తెచ్చుకుంది. ఐతే స్విగ్గి లో ఆర్డర్ పెడుతున్నాం అంటే ఈసారి అమితాబ్ ని గుర్తు చేసుకోవడం జరుగుతుంది.
Also Read : The Raja Saab : ప్రభాస్ ‘రాజాసాబ్’తో తమ నష్టాలు పూడ్చుకుంటాం అంటున్న నిర్మాత..