Prabhas Kalki OTT Rights : కల్కి ఎక్కడ తగ్గట్లేదు.. ఓటీటీ రైట్స్ మైండ్ బ్లాక్ అయ్యే డీల్..!
Prabhas Kalki OTT Rights ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న
- Author : Ramesh
Date : 23-03-2024 - 2:39 IST
Published By : Hashtagu Telugu Desk
Prabhas Kalki OTT Rights ప్రభాస్ లీడ్ రోల్ లో నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898 AD. వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ప్రతి నాయకుడిగా కమల్ హాసన్ ని తీసుకున్నారు. అమితాబ్, దిశా పటాని లాంటి స్టార్స్ కూడా సినిమాలో భాగం అవుతున్నారు.
మే 9న రిలీజ్ లాక్ చేసిన కల్కి సినిమా థియేట్రికల్ రైట్స్ లో ఆల్రెడీ బిజినెస్ జరుగుతుండగా ఓటీటీ రైట్స్ విషయంలో కూడా భారీ ధర పలుకుతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ సంస్థలు కల్కి సినిమాను సొంతం చేసుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైం 170 నుంచి 180 కోట్ల దాకా కోట్ చేశారని తెలుస్తుంది.
అయితే కల్కి మేకర్స్ మాత్రం 200 కోట్లు ఇస్తేనే ఓటీటీ డీల్ క్లోజ్ చేస్తామని చెబుతున్నారట. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ఈ రెండిటిలో ఏ OTT కల్కి ని దక్కించుకుంటుందో చూడాలి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో సత్తా చాటుతాడని అంటున్నారు. హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కల్కి ఉంటుందని ప్రచార చిత్రాలు చూస్తేనే అర్ధమవుతుంది.
Also Read : Prasanth Varma : ‘జై హనుమాన్’ పక్కన పెట్టిసిన ప్రశాంత్ వర్మ..? అనుపమతో సినిమా.. ఆల్రెడీ షూటింగ్..?