Tamannaah : భోళా శంకరుడు నా వెకేషన్ ప్లాన్స్ ను పాడుచేశాడు!
- By Balu J Published Date - 11:49 AM, Fri - 12 November 21

చిరంజీవి కొణిదెలతో తమన్నాకి ఇది మొదటి సినిమా కాదు.. వీరిద్దరూ చివరిసారిగా సైరా నరసింహారెడ్డిలో కలిసి కనిపించారు. అంతేకాదు.. చిరు తనయుడు రాంచరణ్ తోనూ సినిమాలు చేసింది ఈ మిల్కీ బ్యూటీ. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా బోళాశంకర్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ఈ సినిమా ముహూర్తం వేడుకకు హాజరైంది. ఈ సందర్భంగా ఆమె పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ “ వరుస సినిమాలతో చాలా బిజీబిజీగా ఉన్నా. వర్క్ నుంచి కాస్త రిలీఫ్ తీసుకునే అవకాశం కూడా లేదు. వెకేషన్స్ వెళ్లక చాలారోజులైంది కూడా. అయితే భోళా శంకర్ మూవీ నా ట్రాక్ లోకి రావడంతో నేను వేసుకున్న ప్లాన్స్ అన్నీ రివర్స్ అయ్యాయి. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకునే మంచి టీం ఇదే. కానీ నా వెకేషన్ ప్లాన్‌లు పాడైపోయాయి. ప్రాజెక్టుకు ఓకే చెప్పినందుకు నిరాశ చెందడం లేదు. మెహర్ రమేష్ నేను ఎప్పటినుంచో పని చేయాలని కోరుకునే వ్యక్తి, వివిధ కారణాల వల్ల ఇది ఇప్పటి వరకు జరగలేదు” అని చెప్పింది తమన్నా.
తనను సరికొత్త అవతార్‌లో చూడటానికి అభిమానులకు ఉత్సాహంగా ఉంది. నేను లుక్స్, పెర్ఫార్మెన్స్ పరంగా ఇంకా నా బెస్ట్ ఇవ్వలేదు, ఈ సినిమాతో అదంతా నెరవేరుతుంది. అని కూడా చెప్పింది. ఈ చిత్రంలో చిరు సోదరిగా కీర్తి సురేష్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనుంది. వేదాళం రీమేక్‌గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో పునఃప్రారంభం కానుంది.