Bharatiyadudu 2: గండికోట లో భారతీయుడు 2 షూటింగ్.. హెలికాప్టర్ లో స్పాట్ కి కమల్ హాసన్
‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని మళ్లీ ఫామ్లోకి కమల్ హాసన్ (Kamal Hassan).
- Author : Maheswara Rao Nadella
Date : 01-02-2023 - 4:30 IST
Published By : Hashtagu Telugu Desk
‘విక్రమ్’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకొని మళ్లీ ఫామ్లోకి కమల్ హాసన్. అదే జోరులో వాయిదా పడ్డ ‘భారతీయుడు 2’ (Bharatiyadudu 2) ను కూడా తిరిగి ట్రాక్ లోకి తెచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ రాయలసీమలో జరుగుతోంది. కడప జిల్లా గండికోటలో వేసిన ప్రత్యేక సెట్‌లో బ్రిటీష్ కాలం నాటి సన్నివేశాలు తీస్తున్నారు. కూరగాయలు, పశువుల అమ్మకాలు జరుగుతున్న మార్కెట్‌పై బ్రిటీష్ పోలీసులు దాడి చేస్తుంటే, కమల్ హాసన్ వారిని ఎదుర్కునే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
కమల్ హాసన్ ఇప్పుడు పూర్తిగా చిత్రంపైనే దృష్టి సారించారు. కమల్ హాసన్ ప్రతి రోజు తిరుపతి నుంచి హెలికాప్టర్‌లో షూటింగ్ కోసం గండికోటకు వచ్చి వెళ్తున్నారు. కమల్ తో పాటు ఆయన స్టైలిస్ట్ అమృత రామ్ కూడా ఇందులోనే ప్రయాణిస్తున్నారు. కమల్ చాపర్ లో స్పాట్ కు వచ్చిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో కమల్ హాసన్‌కు జంటగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరణ్‌తో కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు
Also Read: Comet: ఆకాశంలో అద్భుతం.. ఈ వారంలో నింగిలో ఆకుపచ్చని తోకచుక్క..